సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై అక్రమ నిర్బంధాలు

నిన్న స‌వీంద్ర‌..నేడు తార‌క్‌, సాయిభార్గవ్‌

హైకోర్టు హెచ్చరించినా మార‌ని పోలీసులు వైఖ‌రి
 

తాడేపల్లి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై అక్ర‌మ నిర్బంధాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్య‌తిరేకిస్తుండ‌టంతో స‌హించ‌లేని కూట‌మి ప్ర‌భుత్వం పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని అక్ర‌మ అరెస్టుల‌కు మ‌రోసారి తెర లేపింది. నిన్న తాడేప‌ల్లిలో సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ స‌వీంద్రారెడ్డిని అక్ర‌మంగా నిర్బంధించిన పోలీసుల వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు ఆదేశాలతో సవీంద్ర విడుదలయ్యారు. అయితే,  ఇవాళ మరో సోషల్ మీడియా యాక్టివిస్టు తారక్‌ ప్రతాప్‌రెడ్డిని నిర్బంధించారు. తారక్‌ను ఎక్కడకు తీసుకెళ్లారో తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ సాయిభార్గవ్‌పై అనంతపురం జిల్లా పోలీసుల ఓవరాక్షన్ చేశారు. ఇంటి నుండి బలవంతంగా రాప్తాడు పీఎస్‌కు తరలించారు. సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయి. మూడు రోజుల్లోనే ముగ్గురు సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారు.

సవీంద్రారెడ్డి అరెస్టుపై ఏపీ హైకోర్టు సీరియస్

Back to Top