రేపు తిరుప‌తి జిల్లాలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

వెంకటగిరిలో వైయ‌స్ఆర్‌ నేతన్ననేస్తం పథకం  

తాడేప‌ల్లి: ఈ నెల 21వ తేదీన (శుక్రవారం, 21–07–2023) తిరుపతి జిల్లాలో సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైయ‌స్ఆర్‌ నేతన్ననేస్తం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్నారు. 

21వ తేదీ ఉదయం సీఎం  వైయస్‌.జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా వెంకటగిరి చేరుకుంటారు.
 అనంతరం విశ్వోదయ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకుని, బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
 అనంతరం వైయ‌స్ఆర్ నేతన్ననేస్తం పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం నగదు జమ చేస్తారు.

ఆ తర్వాత వెంకటగిరి త్రిభువన్‌ సెంటర్‌లో మాజీముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్ధనరెడ్డి విగ్రహాన్ని సీఎం  వైయస్‌.జగన్‌ ఆవిష్కరిస్తారు. 

కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. 

Back to Top