ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అస్వస్థత

 నెల్లూరు జిల్లా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమంచర్లలో ‘జగనన్న మాట-గడపగడపకూ కోటంరెడ్డి బాటలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అరుంధతీ వాడలో సహపంక్తి భోజనం చేసిన అయన అలసటకు గురయ్యారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకొన్న కోటంరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 

నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించిన వైద్యులు చెన్నైకి రెఫర్ చేసారు. సమాచారం అందుకొన్న మంత్రి కాకాణి ఆసుపత్రికి చేరుకుని కోటంరెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితిపై వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి కోటంరెడ్డిని తరలించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top