వైయ‌స్ఆర్‌సీపీ రీట్వీట్‌తో నీళ్లు నమిలిన నారా లోకేష్ 

 అమరావతి : రాష్ట్ర అప్పులపై నారా లోకేష్ కాకిలెక్కలు చెప్పారు. కళ్లార్పకుండా అబద్దాలను చెప్పడంలో తండ్రి చంద్రబాబును మించిన తనయుడిగా చెలామణి అవుతున్నారు.  నారా లోకేష్‌ తాజాగా ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పులను మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే అని చూపుతూ ట్వీట్‌లో పేర్కొన్నారు. విభజన సమయానికి ఏపీ వాటా అప్పుల వడ్డీ రూ.7,488 కోట్లు ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్ర అప్పులు బాగా పెరిగాయి.

ఇదే అంశాన్ని వైయ‌స్ఆర్‌సీపీ ఆధారాలతో సహా నిరూపించింది. వైయ‌స్ఆర్‌సీపీ రీట్వీట్‌తో లోకేష్‌ నీళ్లు నమిలారు. ఆర్థిక విధ్వంసుడు తన తండ్రేనని తేలడంతో కిక్కురుమనకుండా లోకేష్‌ సైలెంట్ అయ్యారు. ఈ తొమ్మిది నెలల్లోనే లక్షన్నర కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు.. ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. మరి ఆ లక్షన్నర కోట్లకు లెక్కలు చెప్పమంటే చంద్రబాబు,లోకేష్ నోరెత్తకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Back to Top