సీపీఐ నేత రామకృష్ణ మాతృమూర్తి మృతిపట్ల వైయస్ జగన్ సంతాపం

తాడేప‌ల్లి: సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ గారి మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారు సంతాపం వ్యక్తం చేశారు. గౌరమ్మ గారి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన వైయస్ జగన్, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. ఈ దుఃఖ సమయంలో రామకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Back to Top