రూ.200 కోట్లు ఇస్తామ‌న్నా వ‌ద్ద‌న్నా.. జ‌గ‌న‌న్న వెంటే ఉంటా

నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధ‌ర్ సంచలన వ్యాఖ్యలు

నంద్యాల‌: ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ‌కు అనుకూలంగా ఓటు వేస్తే రూ.200 కోట్లు ఇస్తామ‌ని టీడీపీ ఆఫ‌ర్ చేసినా వ‌ద్ద‌న్నాన‌ని, వైయ‌స్ జ‌గ‌న్ వెంటే ఉంటాన‌ని చెప్పిన‌ట్లు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థ‌ర్ స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న‌కు కూడా టీడీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్య‌ర్థికి ఓటు వేయాల‌ని త‌న‌తో పాటు త‌న కుమారుడిని ప్ర‌లోభ‌పెట్టేందుకు ప్ర‌య‌త్నించార‌ని ఎమ్మెల్యే తెలిపారు. టీడీపీ తనకు ఆఫర్ చేసిన స‌మ‌యంలో మరో ఎమ్మెల్యే ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడానని ఆర్థ‌ర్ చెప్పారు.  ఒక వైపు రూ.200 కోట్లు డబ్బులు..మ‌రో వైపు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఫోటో పెడితే.. తాను వైయ‌స్ జగన్ ఫోటోన తీసుకుంటాన‌ని ఎమ్మెల్యే ఆర్థ‌ర్ ఉద్ఘాటించారు. త‌న‌కు ఫోన్ చేసినవారికి కూడా వార్నింగ్ ఇచ్చానని.. ఇలాంటి ఆటలు సాగవని హెచ్చరించిన‌ట్లు ఇవాళ ఎమ్మెల్యే ఆర్థ‌ర్ మీడియాకు వివ‌రించారు. 

ఎమ్మెల్యే ఆర్థ‌ర్ ఏమ‌న్నారంటే..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మీ నాన్న ఆర్థ‌ర్‌తో ఓటు వేయించాల‌ని నా కుమారుడికి ఫోన్ చేశారని.. 'మా నాన్న ఇలాంటివి ఒప్పుకోడని నా కుమారుడు వారికి చెప్పాడు. పోలింగ్ ముందు రోజు అర్ధరాత్రి తాడేపల్లిలో తన ఇంటి దగ్గర కలవాలని కొంద‌రు ప్ర‌య‌త్నించారు.  ముందు వ్యక్తిగతంగా మాట్లాడాలని గన్‌మెన్‌ను కొందరు సంప్రదించారు. గన్ మెన్ ఫోన్‌లో మాట్లాడిస్తే కర్నూలు త్రీ టౌన్ సీఐ దగ్గర చిన్న ప‌ని ఉంది.. పర్సనల్‌గా మాట్లాడాలని తనతో చెప్పారు. ఈ సమయంలో వద్దు.. ఉదయాన్నే రమ్మని వారితో చెప్పాను. అక్కడితో ఆగకుండా ఓటు వేసే ముందు కూడా తనకు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాను. తనతో పర్సనల్‌గా మాట్లాడాలని అవతలి వ్యక్తి అంటే.. 'మీ ఆటలన్నీ నాకు తెలుసు' అంటూ వారిని హెచ్చరించాను. ఒకవేళ తన ముందు రూ.200 కోట్లు ఓవైపు.. వైయ‌స్‌ జగన్ ఫొటో ఒకవైపు పెడితే.. తాను వైయ‌స్ జగన్ ఫోటోనే తీసుకుంటాను. తాను అలా డబ్బుల కోసం ఆశపడే వ్యక్తిని కాదు.. వైయ‌స్ జగన్‌తో తన ప్రయాణం కొనసాగుతుంద‌ని ఆర్థ‌ర్ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top