చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడిగా ఎన్‌.వెంకటేగౌడ

 మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఎన్నికతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల సంబరాలు

 చిత్తూరు: చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడిగా పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఎన్‌.వెంకటేగౌడ ఎన్నికైన సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. చిత్తూరులోని వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్‌.వెంకటేగౌడకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Back to Top