చంద్రబాబు ఆస్తుల వెనుక మర్మం ఏమిటో..?

ఆస్తులు అమాంతం పెరుగుదలపై ప్రజలకు సమాధానం చెప్పాలి

ఏపీ ఎన్నికల్లో ధన ప్రవాహం

డబ్బుతో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి  వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్‌: చంద్రబాబు ఆస్తులు అమాంతం పెరగడం వెనుక చిదంబరం రహస్యం ఏమిటని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.హైదరాబాద్‌ వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 1988లో చంద్రబాబు 77 ఎకరాల భూమి తన కుటుంబానికి ఉన్నట్లుగా.. రెండు లక్షల ఇరవై ఐదువేల రూపాయలు ఆదాయం వస్తున్నట్లుగా అఫిడవిట్‌లో పేర్కొరని, 1999లో ఎన్నికల అఫిడవిట్‌లో ఏడున్నర కోట్ల ఆస్తులను చూపించారని, 2004 ఎన్నికలలో 20  కోట్ల ఆస్తులు, 2009 ఎన్నికల్లో 60 కోట్ల చూపించారని తెలిపారు. రెండు రోజులు క్రితం చంద్రబాబు సమర్పించిన తాజా అఫిడవిట్‌లో చంద్రబాబు వారి కుటుంబ ఆస్తుల విలువ 1042 కోట్లుగా పేర్కొన్నారని, గత 2014లో చెప్పినదానికి, నేడు చెప్పిన దానికి చంద్రబాబు ఆస్తుల విలువలు అమాంతం 500 రెట్లు పెరిగాయన్నారు. రెండు ఎకరాల నుంచి 1000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

చంద్రబాబు ఆస్తులు ఎలా పెరిగాయో ఇప్పటికీ సమాధానం లేదన్నారు. ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.ఆస్తుల పెరగడం వెనుక చిదంబర రహస్యం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే హెరిటేజ్‌ లాభాలు అమాంతంగా పెరిగిపోతాయని, చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చోగానే లాభాలు తరిగిపోతాయన్నారు. 2004లో చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత హెరిటేజ్‌ నష్టాల బాట పట్టిందన్నారు. 2013లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో హెరిటేజ్‌ లాభాల బాట పట్టిందన్నారు. కాంగ్రెస్,టీడీపీ దోస్తి కొనసాగిన సమయంలో,కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా చంద్రబాబు కాపాడిన ఆ సమయంలో హెరిటేజ్‌ అమాంతంగా లాభాల బాట పట్టిందని గుర్తుచేశారు.

ఆస్తులపై ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు లెక్కలు చెప్పాలన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు బినామీలు ఏ డబ్బుతో లక్షల ఎకరాలు కొన్నారో తెలిపాలన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. ఆంధ్రలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలియడానికి ఏపీ నుంచి బ్యాగులు సరాఫరా చేయడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. మూడు నెలల క్రితం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పానర్‌ చేయడానికి డబ్బు మూటలను పంపిణీ చేయడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు.ç Üదావర్తి భూములను కొన్న వ్యక్తి ఎవరని ప్రశ్నించారు. కేవలం 10 ఎకరాలు కూడా కొనడానికి స్థోమత లేని వ్యక్తి చేత 84 ఎకరాలు కొనిపించారంటే..ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు.

జరగబోయే ఎన్నికల్లో ఏపీ అంతట డబ్బు మూటలతో ధన ప్రవాహంతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారని..ఈ డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పాలన్నారు.30 ఏళ్లలో నా ఆస్తి ఇలా పెరిగిందని చంద్రబాబు ప్రజలతో చెప్పడానికి ఎందుకు స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని ప్రశ్నించారు.పాలు,పెరుగు అమ్ముకునే మిగతా వారు ఎందుకు అంతా లాభాలు పొందలేకపోతున్నారని, కేవలం హెరిటేజ్‌ మాత్రమే ఎందుకంతా అభాలు పొందుతుందనే మర్మం ఏమిటో చెప్పాలన్నారు.చంద్రబాబు,లోకేష్‌  పేరు మీద ఆస్తులు అసలు విలువ దాచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.

 

Back to Top