ఆర్‌సీఈపీ నుంచి బయటకు రావడాన్ని స్వాగతిస్తున్నాం

అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి
 

తాడేపల్లి: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య విధానం (ఆర్‌సీఈపీ) నుంచి బయటకు వస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వైయస్‌ఆర్‌ సీపీ స్వాగతిస్తుందని ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. ఎగుమతులు ఉన్న దేశాలకే ఆర్‌సీఈపీ ద్వారా మేలు జరుగుతుందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  2012 సంవత్సరంలో 16 దేశాలు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య విధానంపై చర్చ మొదలుపెట్టారని ఇందులో మన భారతదేశంతో పాటు చైనా, జపాన్‌ దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, థాయ్‌ల్యాండ్‌తో వంటి దేశాలు ఉన్నాయన్నారు. 16 దేశాలను కలిపి ఇప్పటికి 30 సార్లు సమావేశాలు జరిగాయన్నారు. నిన్న (నవంబర్‌ 4) జరిగిన ఫైనల్‌ మీటింగ్‌లో 16 దేశాల వాణిజ్య ఒప్పందం నుంచి భారతదేశం బయటకు రావడం మంచిదేనన్నారు. ఆర్‌సీఈపీలోని పరిస్థితులు, అగ్రిమెంట్‌లోకి వెళితే రైతాంగం మొత్తం సంక్షోభంలోకి వెళ్లిపోతాయని, పారిశ్రామిక వర్గాలు కూడా తీవ్రంగా నష్టపోతాయని ఈ మధ్య కాలంలో వ్యాపార సంస్థలు, రైతు సంఘాలు లేవనెత్తుతూ వచ్చాయన్నారు. సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు.

Read Also: స్కూళ్లు, ఆసుపత్రుల్లో నాడు- నేడు కార్యక్రమం

Back to Top