స్కూళ్లు, ఆసుపత్రుల్లో నాడు- నేడు కార్యక్రమం

దాదాపు 45 వేల స్కూళ్లను బాగు చేసేందుకు ప్రణాళికలు

నాడు-నేడు కింద స్కూళ్లలో 9 రకాల పనులు చేపడుతాం

త్వరలోనే డీఎస్సీ రిక్కూట్‌మెంట్‌ ఉంటుంది

మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: బాలల దినోత్సవం నాడు నవంబరు 14న నాడు-నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. నాడు-నేడు కార్యక్రమంలో సీఎం అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. సమీక్ష వివరాలను మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని గత ప్రభుత్వం బాకాలూదిందని, మానవ వనరుల అభివృద్ధి అంటే పాఠశాలల మౌలిక వసతులు కావా అని ప్రశ్నించారు. పాఠశాలలనే ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు నియోజకవర్గంలో కూడా 116 స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పవన్‌ కళ్యాణ్‌ మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయలేదని, కేవలం రంగులు పూసి హంగామా చేశారన్నారు. మా ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. బ్లాక్‌బోర్డ్స్‌, కాంపాండ్‌వాల్‌, మరుగుదొడ్లు ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన ఇవాళ 2.30 గంటల పాటు నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షించామని చెప్పారు. మౌలిక వసతుల రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. దాదాపు 45 వేల స్కూళ్లలో నాడు-నేడు కింద బాగు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం కింద స్కూళ్లలో 9 రకాల పనులు చేపడుతామని వివరించారు. నవంబర్‌ 14న ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో సీఎం చేతుల మీదుగా నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు, అపై సంవత్సరం నుంచి 9వ తరగతి ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభిస్తామన్నారు. ఇంగ్లీష్‌లో బోధించేందుకు అర్హత కలిగిన అధ్యాపకులను నియమిస్తామని, డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న టీచర్స్‌కు కూడా శిక్షణ ఇస్తామన్నారు. దశల వారిగా ఇంగ్లీష్‌ బోధనపై తర్పీదు ఇస్తామన్నారు. త్వరలోనే డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. 

 

Read Also: ప్రభుత్వ ఆసుపత్రులను  బాగు చేస్తాం

తాజా ఫోటోలు

Back to Top