ఏ ఒక్క రైతుకు అన్యాయం జరుగదు

గతేడాది కంటే 13 శాతం వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి

రాజధాని తరలించమని ఎవరూ చెప్పలేదు

అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం

అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి

తాడేపల్లి: ఏ ఒక్క రైతుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం జరుగదని ఏపీ అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజధాని రైతుల గురించి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు. అమరావతి నుంచి రాజధాని తరలించాలని ఏ కమిటీ చెప్పలేదని, అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సచివాలయంలో ఎంవీఎస్‌ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఇప్పటికే డబ్బులు జమా చేశాం 
రెండో విడత డబ్బులు కూడా దాదాపుగా ఇచ్చారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ ఇస్తున్నాం. ప్రధాన పంటలకు మద్దతు ధర ఇస్తున్నాం. గతేడాది ఖరీఫ్లో 106.51 లక్షల టన్నులు అన్ని ప్రధాన పంటలు పండితే..ఈ ఏడాది 120.43 లక్షల టన్నుల ఉత్పత్తి అయ్యాయి. 13 శాతం వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. ప్రజలు ఏదికోరుకున్నారో అది ఈ ప్రభుత్వం చేస్తోంది. రైతుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏ విధంగా అండగా నిలిచారో..అదే రీతిలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారు. రాజధాని విషయంలో అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రకటన ఒక్కసారి గమనించండి. ప్రపంచానికి పాఠాలు చెప్పిన వ్యక్తిని నేను..నాకు ఎవరి సలహాలు అవసరం లేదని నాడు చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అప్పుడున్న పరిస్థితుల్లో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదని ఆ రోజు వైఎస్‌ జగన్‌ చెప్పారు. కానీ ప్రభుత్వ భూమి 30 వేల ఎకరాలు ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ సలహా ఇచ్చారు. ఇప్పుడు రాజధానిపై జీఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీ, సీఎం వైయస్‌ జగన్‌ కూడా ఇక్కడి నుంచి రాజధానిని తీసివెస్తున్నట్లు ఎవరూ కూడా చెప్పలేదు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం సమాంతరంగా ఉంటుందన్నారు. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 14 శాతం అయితే..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 22 శాతం ఉండేది.  ఇవాళ ఏపీ జీడీపీ 30 శాతం ఉంది. పరిశ్రమలు, సేవా రంగ సంస్థలు, పరిశోధన సంస్థలు అన్నీ కూడా తెలంగాణకు వెళ్లిపోయాయి. కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్‌ వచ్చింది. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవాలి. సేవా రంగాలు, వ్యవసాయాన్ని డెవలప్‌ చేసుకోవాల్సి ఉంది. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కమిటీలు కూడా ఇవే చెప్పాయని గుర్తు చేశారు. రాజధాని విషయంలో ఎవరైనా తమన సలహాలు, సూచనలు ఇస్తే కమిటీలు స్వీకరిస్తాయన్నారు. రాజధాని రైతులు ఎవరైనా సరే ఈ విషయంలో ఎదైనా చెప్పాలనుకుంటే సంతోషంగా ముందుకు రావాలని ప్రభుత్వం కూడా ఆహ్వానిస్తుందన్నారు.హైపవర్‌ కమిటీకి విజ్ఞప్తి చేయాలి. నిజంగా చంద్రబాబుకు ప్రాంతాల మీద ప్రేమ ఉంటే..గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని గ్రీన్‌ జోన్లో రాజధాని ఎందుకు పెట్టావు?  ఇవాళ పెనమలూరు ప్రాంతంలో గ్రీన్‌జోన్‌ పెట్టి ..ఇవాళ అయ్యో..ఉద్యమించండి రైతు సోదరులా అంటూ మాట్లాడుతున్నావా? . నీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం..నీవు..నీ కోటరీ కొనుగోలు చేసిన భూములకు విలువ పెంచేందుకు అభివృద్ధి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని ఏర్పాటు చేశావు.  దీనిపై కూడా ప్రభుత్వం సమగ్ర ఆలోచనతో ఉంది. ఏ ఒక్క రైతుకు నష్టం జరుగకుండా గ్రీన్‌ జోన్‌ విషయంలో కూడా ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమాన్ని నీరిగార్చారు. తన పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకున్న రోజు కూడా చంద్రబాబు అన్న మాటలు అందరికి గుర్తున్నాయి. నాకు ఓట్లు వేయని ప్రాంతాల్లో నేనేలా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతుల గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మరో ఉద్యమం రాకూడదనే, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కమిటీలు నివేదికలు ఇచ్చారు. తండ్రి ఆశయంతో వచ్చిన వ్యక్తి వైయస్‌ జగన్‌..నిరంతరాయంగా సంక్షేమ పథకాలు అందాలని సీఎం కృషి చేస్తున్నారు. ఏడు నెలల్లో ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. భూమి యాజమాన్య హక్కు కోసం చట్టాన్ని చేసి, రైతులకు ఒక భద్రత కల్పిస్తోంది. కౌలు రైతులకు చట్టాన్ని చేశాం. దేశంలోనే రైతులకు పెట్టుబడి నిధి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైయస్‌ జగన్‌ ప్రభుత్వానిదే. ఏ ఒక్క రైతుకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. పాత రోజులను ఒకసారి మననం చేసుకోవాలని ఎంవీఎస్‌ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. 

 

తాజా ఫోటోలు

Back to Top