మళ్లీ మళ్లీ వైయ‌స్ జగన్ ప్రభుత్వమే రావాలి 

ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు ముత్తు బాలస్వామి 

ప‌ల్నాడు:  రాష్ట్రంలో మ‌ళ్లీ మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి రావాల‌ని ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు ముత్తు బాల‌స్వామి ఆకాంక్షించారు. వేజెండ్ల మండలం, కొర్రపాడు గ్రామానికి చెందిన ముత్తు బాలస్వామి వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో పాల్గొని త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. 

బాల‌స్వామి ఏమ‌న్నారంటే..
నాకు ఈ మధ్యనే క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే క్యాన్సర్ కు దాదాపుగా డాక్టర్లు కూడా లాభం లేదన్నారు. ఆరోగ్యశ్రీ కింద నాకు ఆపరేషన్ చేశారు. ఇందులో భాగంగా రూ.6 లక్షల వరకు బిల్లును ప్రభుత్వమే ఆసుపత్రికి చెల్లించింది. అయితే నేను చనిపోతాను అనుకున్నవాడిని కూడా మళ్లీ బ్రతికాను. జగన్ ప్రభుత్వం నాకు చేసిన మేలు నా జీవితంలో మరిచిపోలేను. ఇంకోటి ఏంటంటే.. నా ఉద్దేశ్యం ఏమిటంటే మళ్లీ మళ్లీ జగన్ ప్రభుత్వమే రావాలని నేను కోరుకుంటున్నాను. అదే వేరే ప్రభుత్వం అయితే నేను బ్రతికే వాడిని కూడా కాదు. అటువంటి సిట్యుయేషన్ నుంచి బయటపడ్డా నేను. కాబట్టి నా కోరిక ఏంటంటే మళ్లీ మళ్లీ జగనే రావాలని ఆశిస్తున్నాను. 

Back to Top