విశాఖలోనే పాలనా రాజధాని  

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌దర్శి విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌:  విశాఖలోనే పరిపాలన రాజధాని వుంటుందని, ఎవరు ఆపినా ఆగదని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌దర్శి విజ‌య‌సాయిరెడ్డి ఉద్ఘాటించారు. గురువారం విజయసాయిరెడ్డి విశాఖలో పర్యటించారు. జాలరిపేటలో మత్స్యకార దేవతలు ఆలయ నిర్మాణం పనులు పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందన్నారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా పరిపాలన రాజధాని విశాఖ రాకుండా ఆగదు. సింహాచలం చుట్టూ ఎంపీ ల్యాడ్స్ తో రక్షణ గోడ నిర్మిస్తాం అన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటార‌ని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారు. దశాబ్దాలుగా ఆ వర్గాలు సామాజికంగానూ, రాజకీయంగానూ పైకి వస్తామంటే అన్ని పార్టీలు సహకరిస్తాయన్నారు.

ప్రస్తుతం 26జిల్లాల బాధ్యతను అధ్యక్షుడు నాకు ఇచ్చారు….ఆ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నా అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా విశాఖపట్నంను నోడల్ జిల్లాగా ఎంచుకున్నాను. కాలువలు, చెరువులు, నదులు ఆక్రమించే హక్కు ఎవరికీ లేదు. అయ్యన్నపాత్రుడు చెరువు కాలువను ఆక్రమించారు. హైకోర్టులో అయ్యన్నకు తాత్కాలికంగా స్టే ఇవ్వొచ్చు. అయ్యన్న ఆక్రమణ విషయం అధికారులు చూసుకుంటార‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.

అలాగే విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 
ఆ గట్టునున్నావా తుప్పన్నా...
ఈ గట్టునున్నావా పప్పన్నా...

ఆ గట్టునుంటే జనసేనకు నిప్పు…
ఈ గట్టునుంటే బీజేపీకి ముప్పు…
మరి ఏ గట్టునుంటావు నారన్న! 

ఏ గట్టునైనా ఉన్నావో లేదో…
కరకట్టనున్నావు నారన్నా!

Back to Top