అమరావతి: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిన లోకేశ్ కామెడీ పండించడంలో మాత్రం తన జోరు కొనసాగిస్తున్నాడని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేత నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై విజయసాయిరెడ్డి మరోమారు విమర్శలు చేశారు. గతంలో జయంతికి, వర్ధంతికి భేదం తెలియకుండా మాట్లాడి అభాసుపాలైన లోకేశ్ కు నిశ్చితార్థానికి, పెళ్లికి తేడా తెలియట్లేదని విమర్శించారు. చంద్రబాబునాయుడు తనకు అప్పగించిన పనిని దత్త పుత్రుడు శ్రద్ధగా చేస్తున్నాడంటూ పవన్ పై విమర్శలు చేశారు. Read Also: కాల్ సెంటర్ ప్రారంభించిన సీఎం వైయస్ జగన్