అధికారం కోల్పోయాక శ్రీరంగ నీతులా?

ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్‌  

 అమరావతి: చంద్రబాబు నాయుడు  అధికారం కోల్పోయాక శ్రీరంగ నీతులు చెబుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలపై  విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. 'సీఎం వైయస్‌ జగన్ సొంత ప్రతిష్టను పెంచుకోవడానికి అప్పు చేసి పప్పుకూడు పెడుతున్నారని ‘కిరసనాయిలు’ తన టీవీలో ఏడుపు రాగాలు తీశాడు. మరి చంద్రబాబు నాయుడు  2.60 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన సంగతిని మాత్రం చెప్పడు. 60 వేల కోట్ల రూపాయల పెండింగు బిల్లులు మిగిల్చి వెళ్లిన విషయం ప్రస్తావించడు. దోపిడీలో తనూ భాగస్వామే కదా!' అని ఓ మీడియా అధినేతపై విమర్శలు గుప్పించారు.

'దేశంలోనే అత్యంత అసమర్థ ఆర్థిక మంత్రిగా యనమల రికార్డులకెక్కారని విజయసాయిరెడ్డి విమర్శించారు. అధిక వడ్డీ ఆశ చూపి దొరికిన చోటల్లా అప్పు చేసి బోర్డు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీ కంటే దారుణంగా ఆర్థిక నిర్వహణ సాగింది ఆయన హయాంలోనే అని గుర్తు చేశారు.  

Read Also: దీపావళి పండుగ ముందే వచ్చింది

Back to Top