దీపావళి పండుగ ముందే వచ్చింది

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు
 

కాకినాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం రూ. 265 కోట్లు మంజూరు చేయడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్‌ రమణయ్య పేటకు చెందిన అగ్రిగోల్డ్‌ బాధితులు రూ.265 కోట్లు మంజూరు చేసిన సీఎం వైయస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, సీఎం ప్రకటనతో ఆనందంగా ఉందన్నారు. దీపావళి పండుగ తమకు ముందే వచ్చిందన్నారు. అగ్రిగోల్డ్‌లో కట్టిన డబ్బులు ఇక రావని ఆశలు వదిలేసుకున్నామని, గత ఐదేళ్లు చంద్రబాబు తమను పట్టించుకోలేదని మండిపడ్డారు. కానీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రూ.265 కోట్లు మంజూరు చేసి రూ.10 వేలు లోపు ఉన్న డిపాజిటర్లను ఆదుకున్నారన్నారు.

Read Also: ఢిల్లీ చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

Back to Top