12న `ప్రజా ఉద్యమం నిర‌స‌న ర్యాలీ` విజయవంతం చేద్దాం!

మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ పిలుపు

పుట్లూరు: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూ 12న శింగనమల నియోజకవర్గ కేంద్రంలో జరగనున్న ప్రజా ఉద్యమం కార్యక్రమానికి ప్రజలు తర‌లిరావాలని వైయస్ఆర్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్  పిలుపునిచ్చారు. పుట్లూరు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన వాల్ పోస్టర్ల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. “మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పేద విద్యార్థుల భవిష్యత్తు చీకటిలో పడిపోతుందని, వైద్య విద్య ధనవంతులకు మాత్రమే పరిమితం కాకూదదన్నారు. వైద్య రంగం లాభం కోసం కాదని ప్రజల ఆరోగ్యం కోసం ఉండాలన్నారు. ప్రజల నిధులతో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇవ్వడం అంటే ప్రజల భవిష్యత్తును అమ్మేయడమే అని విమర్శించారు. పేద విద్యార్తుల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని , తమ హక్కుల కోసం గళం విప్పాలన్నారు. ప్రజా ఉద్యమం ద్వారా మన గొంతు రాష్ట్రానికి వినిపిద్దాం!” అని ఆయన పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఎల్‌.ఏం. మోహన్ రెడ్డి, మండల పరిశీలకులు, రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి, మండల కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి  పాల్గొన్నారు.
 

Back to Top