తాడేపల్లి: సీపీ బ్రౌన్ జయంతి సందర్బంగా వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్.. ఆయనకు నివాళి అర్పించారు. ఈ క్రమంలో వైయస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘తెలుగు భాషను ప్రేమించి, తెలుగు సాహిత్యాన్ని ముద్రించి భద్రపరచి, ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు సీపీ బ్రౌన్. ఆయన సమకూర్చిన తెలుగు–ఇంగ్లీష్ నిఘంటువు తెలుగు భాష అభివృద్ధికి శాశ్వతమైన పునాది వేసింది. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.