ప‌ప్పు దానికి కూడా ప‌నికి రాడు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

న్యూఢిల్లీ:  రాష్ట్రాభివృద్ధికి అడ్డుప‌డుతున్న ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడి తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. ఈ మేర‌కు శుక్ర‌వారం విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
నీతిలేని నాయకుడు ఎవరని అడిగితే భవిష్యత్తు తరాలు చంద్రబాబునే  చూపిస్తాయి. అధికార దుర్వినియోగంతో ఆయన చేసినన్ని అరాచకాలు దేశంలో ఎవరూ చేసి ఉండరు. చివరకు ఏకైక పుత్ర రత్నాన్ని మహిళలపట్ల గౌరవం లేని కుసంస్కారిని చేశారు. పిడకకూ ఒక ప్రయోజనం ఉంటుంది. పప్పు దానికి కూడా పనికిరాడు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఆ నినాదం అంతులేని వ్య‌థ‌గా మిలిగిపోయిన‌ట్లే 
అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మూడు రాజధానుల అభివృద్ధి కొనసాగుతుందని జగన్ గారు అసెంబ్లీలో చేసిన ప్రకటన పచ్చ బ్యాచ్‌ గుండెల్లో గునపంలా దిగి ఉంటుంది. పేల్చిన టపాసులు, పంచిన మిఠాయిల ఖర్చులు వేస్ట్‌ అయ్యాయి. ఒకే రాజధాని నినాదం అంతులేని వ్యథగా మిగిలిపోయినట్టే అంటూ  విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

‘అలిపిరి దాడి’పై ఆశ పెట్టుకుంటే ఏం జరిగింది?
 బాబు, భజన మీడియా కాలంచెల్లిన మైండ్‌సెట్‌తో అక్కడే గిరికీలు కొడుతున్నారు. 2004లో ‘అలిపిరి దాడి’పై ఆశ పెట్టుకుంటే ఏం జరిగింది? 2019లో పసుపు, కుంకుమలే రంగు వెలిసిపోయేలా చేశాయి. దొంగ తానే అయినా కెలికి మరీ లిక్కర్ బ్రాండ్ల లోగుట్టు బైట పెట్టించుకున్నారు. దిక్కు తోచడం లేదు పాపం! అంటూ అంత‌కు ముందు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top