కే ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలవుతోంది

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ 
 

అమ‌రావ‌తి:  టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు  ‘కె’ ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలు అవుతోందని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘కోడెల కే ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలవుతోంది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కొడుకు, కూతురు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని బతికే వారిని దోచుకోవడంపై పూర్తి దర్యాప్తు జరుగుతుంది. కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించిన మాజీ స్పీకర్ పై ఎబెట్ మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి’ అని  ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top