తాడేపల్లి: ప్రపంచం అంతా ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ పై ఆసక్తిగా ఉంటే మన ప్రతిపక్ష నాయకుడు, అయన పుత్రరత్నం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలను ఎలా అడ్డుకోవాలి? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను ఎలా చెడగొట్టాలి? కులాల మధ్య కుంపటి ఎలా రగిలించాలి? ఇదే ఆలోచన. ఎవడి కర్మ కు ఎవరు బాధ్యులు? అంటూ వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయం అసాధ్యమనే నిస్పృహ మనిషిని ఉన్మాద స్థితిలోకి నెడుతుంది. సైకాలజీలో దీన్ని Post-traumatic Stress Disorder అంటారు. ప్రజాక్షేత్రాన్ని వదిలి వ్యక్తి కేంద్రంగా దాడులకు దిగడం దీని లక్షణమే. తొలుత దొంగ దెబ్బలతో బెదిరించాలని చూస్తారు. ఫైనల్ గా భౌతిక నిర్మూలనకు కుట్ర చేస్తారు అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.