ఎన్టీఆర్ వెన్నుపోటు కుట్రలో అశోకుడే బాబుకు కుడి భుజం

 వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ అశోక్ గజపతిరాజు తీరును  వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. 'ఎన్టీఆర్ వెన్నుపోటు కుట్రలో అశోకుడే బాబుకు కుడి భుజం అయ్యాడు. ద్రోహమే జీవన విధానంగా మార్చుకున్నాడు. 2017లో కూనేరులో హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి 42 మంది చనిపోతే దానిని మావోల దుశ్చర్య అని ప్రకటించేలా రైల్వే సేఫ్టీ కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చాడు. ఎన్ఐఏను తప్పుదోవ పట్టించాడు' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

'పట్టా విరిగి ఘోర రైలు ప్రమాదం జరిగితే బాధ్యుడైన అప్పటి డీఆర్‌ఎంను రక్షించడానికి నక్సల్స్ విధ్వంసం అనే కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఇదంతా అశోక్ కనుసన్నల్లోనే జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. కేసును చంద్రబాబు ప్రభుత్వంలోని సీఐడీకి బదిలీ చేశారు' అని విజ‌యసాయిరెడ్డి ఆరోపించారు.

'హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మరణించిన వారంతా ఉత్తరాంధ్ర, ఒడిశాలకు చెందిన గిరిజనులు. ఈ ఘటనను తప్పుదోవ పట్టించి మృతుల కుటుంబాలకు న్యాయం జరగకుండా అడ్డుకున్నాడు అశోక్. డబ్బుకు లొంగిపోయి విషాద దుర్ఘటనను నక్సల్స్ పైకి నెట్టి చేతులు దులుపుకున్నాడు. పాపం వెంటాడుతుంది అశోక్' అని విజ‌యసాయిరెడ్డి పేర్కొన్నారు.

కాగా, చంద్ర‌బాబు నాయుడి వాట్సాప్ చాటింగ్ అంటూ రెండు ఫొటోలను పోస్ట్ చేస్తూ విజ‌య‌సాయిరెడ్డి ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. 'కోట్లతో ఓటు కొన్న కేసులో ఫోన్లో భ్రీఫ్‌డ్.. ఇప్పుడు వాట్సాప్ లో బ్రీఫ్‌డ్.. స్టేట్ మారింది, ఫోన్, క్లైంట్ మారాడు.. బ్రోకరిజం, బ్రీఫ్‌డ్ మాత్రం మారలేదు. ఇదే  "కుట్రబాబు"  స్టైల్ మనీ పాలిటిక్స్' అని విజ‌యసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top