నీ మొసలి కన్నీరు, కొంగ జపాలు జనానికి తెలియవా బాబూ?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

 
తాడేప‌ల్లి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. నిజాం షుగర్స్, డజను సహకార చక్కెర కర్మాగారాలు, అల్విన్ వాచెస్, స్పిన్నింగ్ మిల్లులు, పేపర్ మిల్లులు మొత్తం 54 సంస్థల్ని అమ్మింది ఎవరు చంద్రం. ఇంకా100 సంస్థల్ని పెకిలించాలనుకున్నావు.లక్షల ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించావు. నీ మొసలి కన్నీరు, కొంగ జపాలు జనానికి తెలియవా బాబూ?

పాద‌యాత్ర రూట్ మ్యాప్ రెడీ..

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  గారి నాయకత్వంలో ఫిబ్రవరి 20, శనివారం ఉదయం 8:30 గంటలకు విశాఖలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల ‘స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర’. జీవీఎంసీ వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహం నుండి మొదలై  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆవరణ వరకు కొనసాగుతుంది. పాద‌యాత్ర‌కు సంబంధించిన  పూర్తి రూట్ మ్యాప్ త‌యారు అయిన‌ట్లు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top