నీచ రాజ‌కీయాలు చేయ‌డం ప‌చ్చ నేత‌ల‌కు మాత్ర‌మే తెలిసిన విద్య‌

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విజ‌య‌వాడ‌:  కనుమనాడు రాష్ట్రంలో దాదాపు 3 వేల ఆలయాల్లో సంప్రదాయబద్దంగా గోపూజ జరిగింది. ఆవులు, దేవాలయాలతో నీచ రాజకీయాలు చేయడం నాయుడు బాబుకు, పచ్చనేతలకు మాత్రమే తెలిసిన విద్య. విగ్రహాలు పగలగొట్టి ఆపైన రాబందుల్లా వాలిపోయి రాజకీయం చేయడం ఏమిటి అచ్చన్నా? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు.

పండగపూట గంగిరెద్దుల వేషంలో కొత్త పచ్చ గ్యాంగ్ తిరుగుతోంది. ఏపీలో మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చు, వర్గ వైషమ్యాలు రగల్చడమే వారిపని. రామతీర్థం నుంచి ఎవరి అజమాయిషీలో దాడులు జరిగాయి? విగ్రహాల ధ్వంసం కేసుల్లో పచ్చనేతలు, పచ్చ మీడియా ప్రతినిధుల పాత్ర ఎంత? అంటూ మ‌రో ట్వీట్‌లో ప్ర‌శ్నించారు

Back to Top