గ్రామాల్లోకి రేషన్ వెళ్లకుండా అడ్డం పడుతున్నాడు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేప‌ల్లి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఇంటింటికీ రేష‌న్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని అడ్డుకుంటున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు.  పేదలకు ఇళ్లు రాకుండా అడ్డుకున్న చంద్రబాబు కుట్రలు పటాపంచలయ్యాయి. ఇప్పుడు గ్రామాల్లోకి రేషన్ వెళ్లకుండా అడ్డంపడుతున్నాడు అంటూ విజ‌య‌సాయిరెడ్డి  ట్వీట్ చేశారు. పేదలకు నిత్యావసరాలు అందించడం "రాజ్యాంగ" బాధ్యత కాదా నిమ్మగడ్డా? ఆహార భద్రతా చట్టాన్ని ఉల్లంఘిస్తావా? అంటూ ప్ర‌శ్నించారు.  

Back to Top