రోజుల లెక్కకు తప్ప ధర్నా దేనికి

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి 

న్యూఢిల్లీ: అమరావతికి ఆ ఎత్తున మద్ధతు ఉంటే ‘ఏసీ’ ధర్నా శిబిరంలో కూర్చున్న వారి బంధుమిత్రులున్న గుంటూరు, విజయవాడ కార్పోరేషన్లలో వన్‌సైడ్‌గా గెలిచి ఉండేవార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు.  రియల్ ఎస్టేట్ గోల తప్ప రాజధానికి ఏం సంబంధమని అక్కడి పౌరులు చెంప పగలగొట్టే తీర్పు చెప్పారు. రోజుల లెక్కకు తప్ప ధర్నా దేనికి అంటూ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

 'అశోక' గుట్టు బయటకొస్తుంది..
మాన్సాస్, సింహాచలం దేవస్థానం భూఅక్రమాలు నిజమేనని ప్రాథమిక విచారణలోనే తేలిపోయింది. విజిలెన్స్ దర్యాప్తులో 'అశోక' గుట్టు బయటకొస్తుంది. ఆడిట్ వద్దంటూ కోర్టుకెళ్ళిన అతనికి మొట్టికాయలు పడ్డాయి. తన అక్రమాలపై విచారణే వద్దంటాడా? ధైర్యంగా ఎదుర్కొంటాడా? తప్పు చేయకపోతే భయమేల అశోకా? అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో  వైయ‌స్‌ జగన్‌ గారి ప్రభుత్వం వచ్చాక వైద్య ఆరోగ్యశాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా అధికారం చేపట్టిన 27 నెలల్లోనే వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 14 వేల పోస్టులను భర్తీ చేసింది. తాజాగా నూతన జాబ్ క్యాలెండర్ లోనూ మరో 6 వేల పోస్టులను ప్రకటించింద‌ని  విజ‌య‌సాయిరెడ్డి ఇంకో ట్వీట్ చేశారు.

Back to Top