ఇంత నీచానికి దిగాలా Tv5 నాయుడూ?

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌: ఎల్లో మీడియా త‌ప్పుడు ప్ర‌చారాన్ని వైయ‌స్ఆర్‌సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్రంగా ఖండించారు.  చంద్రబాబు విసిరే ఎంగిలి మెతుకుల కోసం ఇంత నీచానికి దిగాలా Tv5 నాయుడూ? ఫైవ్, ఫైవ్ అంటూ రోడ్డు పక్కన ఇంకేదైనా చీకటి వ్యాపారం చేస్తే గిట్టుబాటు అవుతుందేమో చూడు. జర్నలిజం ముసుగులో టీవీ ఛానెల్ తో నీవు చేయగలిగింది ఏమీ లేదు. జనాల ఉమ్మిలో కొట్టుకుపోతున్న నీ ‘యజమాని’ని ఒడ్డుకు లాగలేవు.
 'పచ్చ'బాటలో నడుస్తూ ప్రభుత్వంపై విషం చిమ్మడం-ఆనక తమ ఎజెండాకు అడ్డువచ్చే నేతలపై బురద జల్లడం కొన్ని రోత ఛానళ్లకు రివాజైంది. గుడ్డకాల్చి ముఖాన వేస్తే వారే తుడుచుకుంటారులే అనుకుంటుంది మీడియా ముసుగేసుకున్న టీడీపీ కులగజ్జి టీవీ5.

మనిషి జన్మ ఎత్తి, సిగ్గూ ఎగ్గూ వదిలేసి బురదలో దొర్లే జంతువులతో కలిసిపోయేవేంటి టివీ-5 నాయుడూ? దేనికైనా కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయి. అన్నిటినీ దాటి ఊబిలోకి జారిపోయావు. బోరు బావిలో పడ్డ పిల్లల్ని తీయొచ్చుకానీ నువ్వు మాత్రం బయటకు రాలేవు. అంతగా పతనమయ్యావు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top