ఎంత స్వామి భక్తి ఉన్నా...ఇంత బరితెగింపా? 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

తాడేప‌ల్లి:  నిమ్మగడ్డ తన చుట్టూ ఉన్న ఎవర్నీ నమ్మడం లేదు.మంగళగిరిలోని టీడీపీ ఆఫీసే ఆయన బ్యాక్ ఆఫీసు! ‘ఈ వాచ్’ యాప్ తయారైంది అక్కడే. లేఖలు, ఆర్డర్ కాపీల డ్రాఫ్టింగ్ అక్కడే. తన తరపున వాదించే లాయర్ల ఏర్పాటు అంతా పచ్చ పార్టీదే. ఎంత స్వామి భక్తి ఉన్నా...ఇంత బరితెగింపా? అంటూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

భళా! ఏమి  డ్రామాలు  నిమ్మగడ్డా, నారా బాబు! నేను  కొట్టినట్లు  నటిస్తా - నువ్వు  ఏడ్చినట్లు  నటించు  అన్నట్లుంది మీ  యవ్వారం. సమాధానం  సంతృప్తిగా  లేకపోతే చర్యలు  తీసుకోవాలిగానీ - టీడీపీ మ్యానిఫెస్టోను నువ్వు  రద్దు  చేయడమేంటయ్యా నిమ్ము! అంటూ అంత‌కుముందు చేసిన ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.

సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, జీవితం సక్రమమైన మార్గంలో వెళుతుంది. సమయాన్ని వృధా చేస్తే, జీవితం కూడా వ్యర్థం అవుతుంది. అంటూ  ఇవాళ ఉద‌యం చేసిన ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

Back to Top