న‌న్ను ఆశీర్వ‌దిస్తున్న అంద‌రికీ స‌ర్వ‌దా కృత‌జ్ఞుడిని

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌:  పుట్టిన రోజు సంద‌ర్భంగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికీ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య సాయిరెడ్డి  కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న ట్వీట్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తున్న అందరకీ సర్వదా కృతజ్ఞుడిని. కరోనా నేపథ్యంలో మన సోదర సోదరీమణులు అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరికీ సాంత్వన కలిగించడం మన తక్షణ కర్తవ్యం. ఫ్లెక్సీ లు, ప్రకటనలు, ఆడంబరాలతో కాకుండా ఆపదలో ఉన్నవారిని అదుకుంటారని ఆశిస్తున్నాను. 

మీ ఆశీస్సులు ఎల్లవేళలా నాకుంటాయని..
పుట్టినరోజు వేడుకలకు నేను  సహజంగానే దూరం. ఇలాంటి సందర్భాలలో మనం హడావిడి అస్సలు చేయకూడదు. అర్థం చేసుకుని సహకరిస్తారని, మీ ఆశీస్సులు ఎల్లవేళలా నాకుంటాయని ఆశిస్తున్నాను. 

చిత్తశుద్ధి లేని శివపూజ ఏలా బాబూ?
దీక్ష, సత్యాగ్రహం ఎంతో నిబద్ధతో చేపట్టాల్సిన గాంధేయ పద్ధతి నిరసనలు. ప్రచార ఆర్భాటాలతో బాబు వాటిని ఈవెంట్ల స్థాయికి దిగజార్చాడు. చిత్తశుద్ధి లేని శివపూజలాగే తయారయ్యాయి ఈ దీక్షలు. మూడు గంటల సినిమాలా మూడు గంటల దీక్ష ఏమిటి? మరీ అర్థం లేకుండా అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

వైద్యులంద‌రికీ కృతజ్ఞతాభివందనాలు..
కరోనా విపత్తు వేళ తమ ప్రాణాలకు తెగించి ముందు వరుసలో నిలబడి నిస్వార్థ సేవలు అందిస్తున్న వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.
 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top