తాడేపల్లి: ఇంకో 25 సంవత్సరాల పాటు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, బీసీలకు సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేశారన్నారు. సీఎం వైయస్ జగన్ సిద్ధాంతాలను నమ్మి తన చిన్ననాటి మిత్రుడు బీద మస్తాన్‌రావు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 1982 నుంచి తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న బీద మస్తాన్‌రావు సీఎం వైయస్ జగన్ పరిపాలనకు ఆకర్షితుడై వైయస్‌ఆర్‌సీపీలో చేరడం జరిగిందన్నారు. ఆయన చేరిక సంతోషంగా ఉందన్నారు. జనాభా ప్రాతిపదకన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన ఘనత వైయస్‌ఆర్ సీపీకే దక్కిందన్నారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా.. మంత్రివర్గంలో 60 శాతం చోటు కల్పించారన్నారు. బీసీలకు సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని, బీసీలంతా సీఎం వైయస్ జగన్ వెంటే ఉంటారన్నారు. Read Also:ఎమ్మెల్యే శంకరరావుకు సీఎం వైయస్ జగన్ ఫోన్‌లో పరామర్శ