ఎమ్మెల్యే శంకరరావుకు సీఎం వైయస్‌ జగన్‌ ఫోన్‌లో పరామర్శ 

గుంటూరు : పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు నంబూరు శంకరరావుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లక్ష్మీకాంతమ‍్మ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో ఎమ్మెల్యేను పరామర్శించారు. ఇవాళ లక్ష్మీకాంతమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు పలువురు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎమ్మెల్యే శంకరరావును పరామర్శించి, సంతాపం తెలిపారు.

Read Also: బీద మస్తాన్‌రావు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

తాజా ఫోటోలు

Back to Top