చంద్రబాబును ప్రజలే వదిలించుకున్నారు

 వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్  వి.విజయసాయిరెడ్డి

గుంటూరు: ప్రజలే చంద్రబాబును వ‌దిలించుకున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు మనస్తత్వం దుర్మార్గమైంద‌ని మండిప‌డ్డారు. వెన్నుపోటు పొడిచే మనçస్తత్వమ‌న్నారు. ఆయనకు నిలకడ లేద‌న్నారు.  అధికారం దాహం తప్ప, తన సామాజిక వర్గాన్ని పెంచుకోవడం తప్ప. ప్రజలంతా నా మనుషులు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. కులాలు, మతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి జరగాల‌న్న‌దే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ధ్యేయ‌మ‌న్నారు.  ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలన్న భావన  చంద్రబాబులో ఏనాడూ లేదు. ఆయన అధికారం వదులుకోవడం కాదు. ప్రజలే ఆయనను వదిలించుకున్నారు. దీన్ని చంద్రబాబు అర్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ కలిసి రావాలని, అవసరమైతే తాము త్యాగాలకూ సిద్ధమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై  విజయసాయిరెడ్డి స్పందించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద  వైయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్ వి.విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఎవ్వరితోనూ పొత్తు అవసరం లేదు:
    వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే భయపడుతున్నారో, ఎవరికైతే ప్రజల మద్దతు లేదో, వారు ఇంకొకరి మద్దతు కోసం ఎదురు చూస్తుంటారు. 
    చంద్రబాబునాయుడులో విశ్వాసం లేదు. ఆయన పట్ల ప్రజలకు విశ్వసనీయత లేదు. ఎప్పుడూ ఇతరులపై ఆధారపడే తత్వం. ఇతరుల మీద ఆధారపడి, వారిని మోసగించి వెన్నుపోటు పొడిచే తత్వం. కాబట్టి చంద్రబాబు పట్ల ప్రజల్లో విశ్వాసం లేదు.

నిస్సందేహంగా..:
    వచ్చే 20, 25 సంవత్సరాల పాటు గౌరవ జగన్‌గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. వైయస్సార్‌సీపీనే అధికారంలో ఉంటుంది. దాంట్లో సందేహం లేదు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నప్పటికీ వైయస్సార్‌ కాంగ్రెస్‌కు గతంలో కంటే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి. ఓట్లు కూడా ఎక్కువే వస్తాయి.

 
వారే ఆ నేరస్తులు:
    టీడీపీ కార్యకర్తలు నాయకులే అత్యాచారాలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజం. ఇవాళ సమాజంలో అశాంతి, అకృత్యాలు, ముఖ్యంగా నేరాలు ఎవరైనా చేస్తున్నారంటే, అది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత, కొందరు గుండాలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించి, క్రిమినల్‌ చర్యలకు పాల్పడుతున్నారు. ఆ విధంగా దుష్ప్రచారం చేసి, ప్రభుత్వాన్ని అప్రతిçష్ట పాల్జేయాలని చూస్తున్నారు. భగవంతుడు ఆయనను తప్పకుండా శిక్షిస్తాడని విజయసాయిరెడ్డి అన్నారు.
 

Back to Top