మంగళగిరి : తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడూ బలంగా లేదని,వచ్చే ఎన్నికల్లో కూడా వరసగా మూడో సారి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వైయస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు..మంగళగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు..తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు మంగళగిరిలో రెండు సార్లు మాత్రమే గెలిచిందని ఆయన గుర్తు చేశారు..ముఖ్యమంత్రి గారు బడుగు బలహిన వర్గాలు,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ వర్గాల వారికి అధిక ప్రధాన్యత ఇస్తున్నారని చెప్పారు..మంగళగిరిలో చేనేత సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారని,దానిలో భాగంగానే ఆ సామాజిక వర్గానికి సిటు కేటాయించారని తెలిపారు..మంగళగిరిలో స్థానికుడిగా ఉన్న గంజి చిరంజీవి కావాలో హైదరాబాదులో ఉండే టిడిపి అభ్యర్థి కావాలో మంగళగిరి ప్రజలు తెల్చుకోవాలని అన్నారు..స్దానికుడు ఎప్పుడూ మీతోనే ఉంటాడని,హైదరాబాదులో ఉండి టూరిస్ట్ లాగా వచ్చే వ్యక్తి మీతో ఉండడని చెప్పారు.మీతోనే ఉండి మీతో కలిసి నడుస్తున్న వ్యక్తి... గంజి చిరంజీవిని ఎన్నుకోవాలని చెప్పారు.. గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన రెడ్డిని కాదని బిసి ఆయిన చిరంజీవికి జగన్ గారు సీటు కేటాయించారని అన్నారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. ఓడిపోతారనే బీసికి టికెట్ ఇచ్చారని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాదానం ఇస్తూ....ఓటమి భయం అనేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదని, రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో బిసి, ఎస్సీ ఎస్టీ,మైనారిటీలకు అధికశాతం సిట్లు ఇస్తున్నామని ఆయన అన్నారు. వారికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసి అని చెప్పారు..ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉందో వారికే పార్టీ సిట్లును కేటాయిస్తోందని చెప్పారు.. రాజకియాల్లో వ్యక్తిగత విమర్శలు తగవు... రాజకీయాలలో వ్యక్త గతంగా విమర్శలు చేయడం తగదని,కుటుంబం వ్యవహారాల వేరు...రాజకియాలు వేరని.. ఈ రెండింటిని ముడిపెట్టడం తగదని అన్నారు... రాష్ట్రాన్ని విభజన చేసి కాంగ్రెస్ పార్టీ ఏ.పిలో చచ్చిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజన చేసి తీరని ద్రోహం చేసిందని ఆయన అన్నారు.. ఈ తరమే కాదు భవిష్యత్ తరాలు కూడా ఆ పార్టీని, సానియా గాందీ,రాహుల్ గాంధీని ఎప్పటికీ క్షమించరని అన్నారు.. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర విభజనను సోనియా గాంధీ చేసిందని మండిపడ్డారు..కాంగ్రెస్ పార్టీకి ఏ.పీలో ఎవరు ప్రాతినిత్యం వహించినా దాన్ని పైకి లేపలేరని అన్నారు. క్రీడలకు ఈ ప్రభుత్వం అధిక ప్రధాన్యత ఇస్తుంది.. ప్రపంచ స్థాయిలో క్రీడాకారులను అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్ధ ఆత్మకూరు వద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్మించిన స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ సర్కిల్,పంపు హౌస్,పైప్ లైన్లు పలు అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్సీ మరుగుడి హనుమంతరావు, పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి,జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి,ఎంటిఎంసి కమిషనర్ నిరంజన్ కుమార్ లతో కలిసి అభివృద్ధి పనులను విజయసాయిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా మాట్లాడారు..మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ 8.5 కోట్ల రూపాయలతో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని,రాష్ట్రం నుండి ప్రపంచ స్థాయిలో మన క్రీడాకారులను అందించాలనే ఉద్దేశంతో అందులో భాగంగానే మంగళగిరిలో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారని అన్నారు.. ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు..మన ముఖ్యమంత్రి విద్య,వైద్యం,గృహ నిర్మాణానికి అధిక ప్రధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు..