తాడేపల్లి నుంచే పార్టీ కార్యకలాపాలు

​మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయం

పనులను పరిశీలించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి 

తాడేపల్లి: ‘వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి తాడేపల్లికి తరలిస్తున్నాం. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం పది రోజుల్లో ప్రారంభం అవుతుంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన నియామకాలు, పరిపాలన తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచే కొనసాగుతాయి’ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లిలో సిద్ధమవుతున్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని వైయస్‌ఆర్‌ సీపీ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, నాయకుడు హర్షలతో కలిసి ఆయన సందర్శించారు. కార్యాలయంలో జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మరో పది రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి ఇక్కడి నుంచే పార్టీ కేంద్ర కార్యాలయం కార్యకలాపాలు మొదలుపెడతామని చెప్పారు. అక్టోబర్, నవంబర్‌ మాసాల్లో మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోటీకి పార్టీ సమాయత్తం అవుతుందని, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అన్ని పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌ కైవసం చేసుకోవడానికి ఇక్కడి నుంచే పథక రచన, వ్యూహ రచనలు రూపొందిస్తామన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఎమ్మెల్యేల సమావేశాలు, ప్రెస్‌మీట్లు అన్ని  నిర్వహించబడతాయని ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. 

ఆంధ్రరాష్ట్రంలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు నవరత్నాల వల్ల ప్రయోజనం చేకూరాలనే సిద్ధాంతాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అందుకు సంబంధించిన నిధులు రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి సమకూర్చుకోని ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం ముందుకెథ్తుందన్నారు. 

Back to Top