వైయ‌స్ఆర్‌ మనసున్న మహారాజు

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
 

విశాఖలో వైయ‌స్సార్‌ సంస్మరణ స‌భ‌

విశాఖపట్నం:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మనసున్న మహారాజు అని ఎంపీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. విశాఖలో వైయ‌స్సార్‌ సంస్మరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,.. దివంగత మహానేత వైయ‌స్సార్‌ సుపరిపాలన అందించారన్నారు. వైయ‌స్సార్‌ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామన్నారు. తండ్రి బాటలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారని తెలిపారు.

‘‘ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైయ‌స్ జగన్‌ నెరవేరుస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నాం. పార్టీలో కష్టపడిన వారందరికీ న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ భూములు ప్రజలకే చెందాలన్నది మా లక్ష్యం. ఎక్కడైనా భూ ఆక్రమణలు జరిగితే ఫిర్యాదు చేయొచ్చు. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని’’ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

వ్యవసాయాన్ని పండగ చేశారు: మంత్రి అవంతి
దివంగత మహానేత వైయ‌స్సార్‌ భౌతికంగా లేకపోయిన ప్రజల గుండెల్లో కొలివై ఉన్నారని మంత్రి అవంత్రి శ్రీనివాస్‌ అన్నారు. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారని కొనియాడారు. రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చిన గొప్ప నేత అని, అభివృద్ధి విషయంలో వైయ‌స్సార్‌ రాజకీయాలు చూడలేదని మంత్రి అవంతి అన్నారు.

Back to Top