దార్శనికుడి కార్యక్రమానికి అందరూ తరలిరండి

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

సీఎం వైయ‌స్‌ జగన్‌కు అంబేద్కర్‌పై ఉన్న అభిమానంతో విగ్రహ నిర్మాణం

ఈ నెల 19న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు 

చరిత్రలో ఈ మహాశిల్పం నిలిచిపోతుంది 

అంబేద్క‌ర్ విగ్ర‌హం ప్రారంభోత్స‌వ ప‌నులు ప‌రిశీలించిన విజ‌య‌సాయిరెడ్డి

విజ‌య‌వాడ‌:  రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ దార్శ‌నికుడ‌ని, ఆయ‌న విగ్ర‌హాం ప్రారంభోత్స‌వం కార్య‌క్ర‌మానికి అంద‌రూ త‌ర‌లిరావాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి కి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై ఉన్న అభిమానంతోనే అంబేద్కర్‌ అతిపెద్ద విగ్రహ నిర్మాణానికి పూనుకున్నారని తెలిపారు విజయవాడ‌లో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధం అవుతోన్న డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహాన్ని.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, నేతలతో కలిసి విజ‌య‌సాయిరెడ్డి పరిశీలించారు.. 19వ తేదీన సీఎం వైయ‌స్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న స్మృతివనంలో ఏర్పాట్లను పరిశీలించి.. కొన్ని సూచనల చేశారు.. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 19వ తేదీన సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాజ్యాంగ కర్తగా బీఆర్ అంబేద్కర్ సామాజిక అభివృద్ధికి తగినట్టుగా రాజ్యాంగం రూపొందించారు.. సీఎం వైయ‌స్‌ జగన్‌కు అంబేద్కర్ పై ఉన్న అభిమానంతో విగ్రహ నిర్మాణం చేశారని తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా సీఎం వైయ‌స్ జగన్‌.. నవరత్నాలు రూపొందించారని పేర్కొన్నారు. చరిత్రలో ఈ మహాశిల్పం నిలిచిపోతుందన్నారు. లక్షా ఇరవై వేల మందితో కార్యక్రమంలో జరుగుతుంది.. సాయంత్రం డ్రోన్ షో నిర్వహిస్తాం అన్నారు. 

ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది.. స్వరాజ్ మైదానాన్ని సంద‌ర్శించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు నేతలు, అధికారులు.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనం ప్రారంభోత్సవ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమం సీఎం వైయ‌స్‌ జగన్‌ చేతుల మీదుగా జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.. ఏలూరు, పల్నాడు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి ప్రజలు తరలిరానున్నారు. రాజకీయ నేతలు, దళితసంఘాలకు చెందిన నేతలు.. ఇలా పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎవరీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.ఎంపీ కేశినేని నాని, మంత్రి మేరుగ నాగార్జున, సీం టూర్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మీ, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి ఆసిఫ్, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్‌. ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ఏర్పాట్లు పరిశీలించారు.

Back to Top