లోక్ సభలో వైయస్ఆర్ సున్నా వడ్డీ ప్రస్తావన

న్యూఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డ్వాక్రా మ‌హిళ‌ల సంక్షేమం కోసం అమ‌లు చేస్తున్న వైయ‌స్ఆర్ సున్నా వ‌డ్డీ ప‌థ‌కం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంగా గీతా డ్వాక్రా సంఘాల గురించి, ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వైయ‌స్ఆర్ సున్నా వ‌డ్డీ ప‌థ‌కం గురించి వివ‌రించారు.  ఇటువంటి పథకాన్ని నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ కింద అమలు చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా.. అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంగా గీత ప్ర‌శ్నించారు.

Back to Top