విశాఖ: ప్రపంచానికే పాఠాలు నేర్పాననే చంద్రబాబుకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గుణపాఠం నేర్పి కుప్పానికే పరిమితం చేశారని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ పోస్టును ట్వీట్ చేశారు. సీఎం వైయస్ జగన్ మూడేళ్ల పాలనలో కుప్పాన్ని మున్సిపాలిటీ చేశారని, 40 ఏళ్ల అనుభవం అనే బాబు చేత కుప్పంలో ఇల్లు కట్టుకునేలా చేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు. తలదించుకుంటే సరిపోతుందా? 3సార్లు CM అయినా కుప్పంను మున్సిపాలిటీ చేయలేక పోయావు. రెవిన్యూ డివిజన్ కోసం వైయస్ జగన్ గారిని ప్రాధేయపడి, నీవల్ల కాలేదని అంగీకరించావు. పక్క రాష్ట్రంలో ఇల్లు కట్టుకున్నావు. కుప్పం ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రజలు నిలదీయారా బాబూ? అంటూ అంతకు ముందు ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లా పోలీసులకు అభినందనలు ఒకే రోజు 1.02 లక్షల దిశ యాప్ రిజిస్ట్రేషన్లు చేయించి రికార్డు సృష్టించిన కృష్ణా జిల్లా పోలీసులకు వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అభినందనలు. మహిళలకు రక్షణ కవచంలాంటి ఈ యాప్ ను జగన్ గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. ప్రతి మహిళా తమ మొబైల్ లో దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి సూచించారు.