గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు

బీసీలను బ్యాక్‌బోన్‌ క్లాసులుగా నిలబెడుతున్న సీఎంకు ధ‌న్య‌వాదాలు

వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య

అమరావతి: వెనుకబడిన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసి.. అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన అనంతరం ఆర్‌.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. పేద కులాల తరఫున పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశాన్ని, పేదల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించినందుకు సీఎం వైయస్‌ జగన్‌కు ఆర్‌.కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు, స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పోస్టుల్లో, ఎమ్మెల్సీల్లో ప్రతి సందర్భాల్లో వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పిస్తూ రాజ్యాధికారం దిశగా వారిని ప్రోత్సహిస్తున్నారని గుర్తుచేశారు. సీఎం వైయస్‌ జగన్‌ బీసీలకు సముచిత స్థానం కల్పించారన్నారు. రాష్ట్రంలోని బీసీలంతా సీఎం వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటారన్నారు. చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేసి దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ నిలిచారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలంతా పెద్ద చదువులు చదువుతున్నారని గుర్తుచేశారు. బీసీలు అంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాసులుగా సీఎం వైయస్‌ జగన్‌ నిలబెడుతున్నారన్నారు. 
 

Back to Top