ఎన్టీఆర్‌ పేరును స్మరించే హక్కు చంద్రబాబుకు లేదు

వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షపాతి సీఎం వైయస్‌ జగన్‌

బీసీలను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు

సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

బీసీలను జెండా మోయడానికే చంద్రబాబు వాడుకున్నారు

అన్ని వర్గాలకు సీఎం వైయస్‌ జగన్‌ హయాంలోనే న్యాయం జరిగింది

 గుంటూరు: ఎన్టీఆర్‌ పేరును స్మరించే హక్కు చంద్రబాబుకు లేదని వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ కష్టపడి స్థాపించిన పార్టీని లాక్కుని, ఆయన మరణానికి చంద్రబాబు కారకుడయ్యారని తెలిపారు. బీసీలను చంద్రబాబు జెండాలు మోసేందుకే వాడుకున్నారని తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేశారన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. గుంటూరులో పార్టీ ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దలగిరిలతో కలిసి మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. 
ఆయన ఏమన్నారంటే.. మోపిదేవి మాటల్లోనే..
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షపాతి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైన వ్యక్తి. ఎన్టీఆర్‌ జపం చేయకుండా, ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించకుండా ప్రజల మధ్యకు వెళ్లలేకపోతున్నారు. శత జయంతి ఉత్సవాలు ఎవరైనా చేయవచ్చు. నిన్న జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రస్తావన చేస్తూ ఇదేనా వైయస్‌ఆర్‌సీపీ సామాజిక న్యాయం అని ప్రస్తావించారు. చంద్రబాబు, టీడీపీ నేతలకు సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. చంద్రబాబు సీఎంగా పని చేసిన సమయంలో ఏ రోజు కూడా సామాజిక న్యాయం పాటించలేదు. రాజకీయపరంగా కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. చంద్రబాబు స్వార్థపూరిత విధానాలతో నిర్ణయాలు తీసుకున్నారే కానీ, బీసీ నాయకుల ప్రాధాన్యత, ప్రాతినిధ్యాన్ని గుర్తించలేదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రాజకీయ పరమైన నిర్ణయాలు, పారిపాలన పరమైన నిర్ణయాలు కావచ్చు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా చంద్రబాబు స్వార్థపూరిత విధానాలతో పాలన సాగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను చంద్రబాబు ఓటు బ్యాంకు కోసమే ఉపయోగించుకున్నారు.వారితో పార్టీ జెండాలు మోయించారే తప్ప ..వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు మచ్చుకు ఒక్కటి కూడా లేదు. ఇవాళ ఏదో ఆ వర్గాలను డైవర్ట్‌ చేయడానికి, వారికి అన్యాయం జరిగిందని అబద్ధాలు చెబుతున్నారు. సామాజిక న్యాయం, సామాజిక సమతూల్యం చేసిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ ఒక్కరే ఉన్నారు. ఈ వర్గాలకు ఈ మూడేళ్లలో న్యాయం జరిగిందని ఉదాహరణలతో సహ మీ ముందు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చిన్న ఉదాహరణ ఏంటంటే రాజ్యసభ స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ తరఫున 9 మందికి అవకాశం వస్తే..అందులో నలుగురు బీసీలు ఉన్నారు. 

చంద్రబాబు సహచరుడైన యనమల రామకృష్ణుడికి రాజ్యసభకు వెళ్లాలని ఆయన తీరని కల. మీతో పాటు రాజకీయాల్లోకి వచ్చారు. బీసీ వర్గానికి చెందిన నాయకుడు. కష్టపడి పని చేసిన వ్యక్తికి రాజ్యసభలో అవకాశం కల్పించలేదు. రాజ్యసభ సీటు కోసం  చివరికి ఎవరికి అవకాశం  ఇచ్చారంటే. బ్యాంకుకు కుచ్చుటోపి పెట్టి  వందల కోట్లు అప్పులు తీసుకొని, అందులో నుంచి కొంత కమీషన్‌ మీకు అప్పగించిన వారికే చంద్రబాబు రాజ్యసభసీట్లు ఇచ్చారు. పదవులను మార్కెట్లో వస్తువుల మాదిరిగా అమ్ముకోవడం, కొనుగోలు చేయడం రాజకీయాల్లోకి తెచ్చిన వ్యక్తి చంద్రబాబు. పార్టీ కోసం కష్టపడి పని చేసి బీసీ, ఎస్సీ, మైనారిటీలకు ఏనాడైనా, ఏ సందర్భంలోనైనా చంద్రబాబు గుర్తించారా?. ఈ వర్గాలకు రాజ్యసభలో ఒక్కరికైనా అవకాశం కల్పించారా? వైయస్‌ జగన్‌ నలుగురికి రాజ్యసభలో అవకాశం కల్పించారు. ఇది సామాజిక న్యాయం. ఇది వైయస్‌ జగన్‌ నైజం. చంద్రబాబుది వ్యాపార నైజం. వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడై నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. 
ఓటుకు కోట్లు కేసుప్రస్తావన వస్తే ఎక్కడ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అరెస్టు చేస్తారోనని రాత్రికి రాత్రి ఏపీకి పరారైన వ్యక్తి ^è ంద్రబాబు. ఎప్పుడు కేసులు వచ్చినా ఎవరో ఒకరి కాళ్లు పట్టుకొని స్టేలు తెచ్చుకునే వ్యక్తి చంద్రబాబు. వైయస్‌ జగన్‌ ఎప్పుడు కూడా తప్పుల కేసుల విషయంలో వెనుకడుగు వేయకుండా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారు. ఆ రోజు కాంగ్రెస్‌ నాయకత్వాన్ని చాలెంజ్‌ చేసి ప్రజల మధ్యలో నిలిచి ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చారు. పారిపోవడం చంద్రబాబు నైజం. నీతినిజాయితీగా ఎదుర్కొనే నైజం వైయస్‌ జగన్‌ది. వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి, చంద్రబాబుకు లేదని ఎంపీ మోపిదేవి వెంకట రమణ సూచించారు.
 

Back to Top