రుయా అంబులెన్సు ఘటనపై చర్యలు

తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆదేశాలతో కదలిన యంత్రాంగం

ఆర్ఎంఓ సస్పెన్షన్, అంబులెన్సు డ్రైవర్లపై క్రిమినల్ కేసులు

తిరుప‌తి: రుయా అంబులెన్సు ఘటనపై తిరుపతి ఆర్డీఓ, డీఎం అండ్‌ హెచ్‌ఓ విచారణ జరిపి ఈ ఘటన వాస్తవమే అని నిర్ధారించిన‌ట్లు ఎంపీ గురుమూర్తి తెలిపారు. రుయా సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసు ఇచ్చామ‌న్నారు. అలాగే రుయా ఆర్ఎంఓ ను సస్పెన్షన్ చేశారు. ఈ ఘటనకు కారకులు, అంబులెన్సుని అడ్డుకున్న నలుగురు డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన‌ట్లు తెలిపారు.

అంబులెన్స్ రేట్లను ఖరారు చేయడానికి ఆర్డీఓ, డీఎం అండ్‌ హెచ్ఓ, డీఎస్పీ. ఆర్టీవో ఆధర్వంలో కమిటీని నియమించారు.  ఈ రేట్లు అన్ని ప్రదేశాలలో  ప్రదర్శించే విధంగా కూడా చర్యలు తీసుకొంటార‌ని ఎంపీ గురుమూర్తి తెలిపారు.  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్  ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎంతటి వారైనా తప్పించుకొనే అవకాశమే ఉండదని  తిరుపతి ఎంపీ గురుమూర్తి హెచ్చ‌రించారు. 

తాజా వీడియోలు

Back to Top