'చంద్రబాబుకు పదవి పిచ్చి, ప్యాకేజీ స్టార్‌కు డబ్బు పిచ్చి'

తూర్పుగోదావరి: రాష్ట్రాన్ని నిలువునా దోచుకోవడమే చంద్రబాబు, లోకేష్‌, దత్తపుత్రుడి ఎజెండా అని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ మండిపడ్డారు. ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కోసం జనసేనను చంద్రబాబు వద్ద పవన్‌ తాకట్టు పెట్టారన్నారు.

చంద్రబాబుకు పదవి పిచ్చి, ప్యాకేజీ స్టార్‌కు డబ్బు పిచ్చి అని ఎద్దేవా చేశారు. పేదలవైపు జగనన్న ఉంటే.. అధర్మం వైపు చంద్రబాబు అండ్‌ కో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు అండ్‌కోకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారు అని ఎంపీ మార్గాని భరత్‌ హెచ్చరించారు.

Back to Top