బీసీలకు వైయస్‌ జగన్‌ తోడుగా ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం

వైయస్‌ఆర్‌ అన్ని విధాలుగా ప్రోత్సహించారు

రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తాం

మోపిదేవి వెంకటరమణ

అమరావతి: రాష్ట్రం నుంచి ఒకేసారి బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను రాజ్యసభకు పంపించి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆత్మసై్థర్యాన్ని కల్పించారని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ బీసీలకు తోడుగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రాంతీయ పార్టీలో బీసీలకు ఇలాంటి అవకాశమివ్వడం అరుదైన సంఘటన అన్నారు.  తనను రాజ్యసభకు పంపించిన సీఎం వైయస్‌ జగన్‌కు, ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్య సభ సభ్యుడిగా ఘన విజయం సాధించిన అనంతరం మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నా రాజకీయ జీవితంలో మరచిపోలేని సుదినం. 1987లో మండల పరిషత్‌ చైర్మన్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించాను. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశాను. రాజ్యసభకు ఇంత త్వరగా ఎంపిక అవుతానని ఊహించలేదు. అరుదైన సంఘటనలో నేను భాగస్వామిని కావడం ఒక విధంగా ఆశ్చర్యకరమైన, సంతోషించదగ్గ విషయం. కార్యకర్తగా విలువ తెలిసిన వ్యక్తిగా పార్టీ నాయకత్వానికి అండగా, చేదోడు వాదోడుగా ఉన్నాను. మన రాష్ట్ర సీఎం వైయస్‌ జగన్‌ ఆశీర్వచనాలతో ఈ రోజు రాజ్యసభకు ఎన్నిక కావడం సంతోషించదగ్గ విషయం. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మొట్ట మొదటి వ్యక్తిగా రాజ్యసభకు ఎన్నికయ్యాను. బీసీ సామాజిక వర్గం నుంచి తనను, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు ఒకేసారి అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. మాకు గుర్తింపు ఇచ్చిన సీఎం వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అరుదైన చరిత్రకు వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. నాకు రాజకీయ ఓనమాలు దిద్దిన రేపల్లికి చెందిన స్వర్గియ బసవ పున్నయ్య అయితే..నన్ను అన్ని విధాల ముందుకు నడిపించింది మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి. ఈ ఇద్దరి ప్రోత్సాహంతో ఈ రోజు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం దక్కింది. ఆ ఇద్దరికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. కార్యకర్తలను, నాయకులను ప్రాంతీయ పార్టీలు వాడుకుంటున్నారు. అయితే వైయస్‌ జగన్‌ ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులను ప్రోత్సహించారు. కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి మరో ఇద్దరు పారిశ్రామికవేత్తలను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడంతో రాష్ట్ర భవిష్యత్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. రాజకీయ పరంగా సమపాళ్లలో తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రాంతీయ పార్టీలు లెక్కలు వేసేవి. గతంలో ఇలాంటి సందర్భాలు అనేకం చూశాం. ఈ రోజు టీడీపీ తరఫున పోటీ చేసిన వర్ల రామయ్యను గతంలో నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో మొండిచేయ్యి చూపించారు. అలాంటి సంఘటనలకు భిన్నంగా నూతన రాజకీయ ప్రస్థానానికి వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం కోసం పార్టీ పెద్దలతో కలిసి, సీఎం వైయస్‌ జగన్‌ డైరెక్షన్‌లో వెళ్లవేళలా పని చేస్తామని చెబుతున్నాను. వైయస్‌ జగన్‌ మాకు ఇలాంటి అవకాశం ఇవ్వడం బీసీ సామాజిక వర్గాలకు ఒక ఆత్మసై్థర్యాన్ని ఇచ్చారు. బీసీలకు వైయస్‌ జగన్‌ తోడుగా ఉన్నారని చెప్పడానికి ఇంతకన్న నిదర్శనం మరొకటి ఉండదని చెబుతున్నాను. మా నియోజకవర్గం తరఫున సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నాను. 
 

Back to Top