విశాఖలో భూములు కారుచౌకగా కట్టబెట్టడమేంటి?

మండ‌లిలో ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి సూటి ప్ర‌శ్న‌

అమ‌రావ‌తి: విశాఖలో విలువైన భూములు కారుచౌకగా కట్టబెట్టడమేంటి? అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. విశాఖలో భూ కేటాయింపులు తీవ్ర విమర్శలకు దారితీశాయి. రూపాయికి గుప్పెడు శనగలు, సింగిల్ టీ కూడా రాదు. కానీ 99 పైసలకే వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టేస్తున్నారు. ఎక్కడైనా వెనకబడిన ప్రాంతాల్లో భూములను తక్కువ ధరకు ఇస్తారు. కానీ ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందిన విశాఖలో భూములు కారుచౌకగా కట్టబెట్టడమేంటి?. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎందుకు భూములిస్తున్నారు. ఏపీఐఐసీ చేసే పని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చారు. ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగా పనిచేస్తాయా?. ప్రభుత్వ భూములను టెండర్లు లేకుండా ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించారు. 

Back to Top