తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఈనాడు అధినేత రామోజీరావు తోడు దొంగలని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత విమర్శించారు. రామోజీ, చంద్రబాబులకు మద్యంపై మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. ‘మార్గదర్శి’ అక్రమాల పుట్టపగులుతుందనే రామోజీరావు ఆక్రోశమన్నారు. మరో అగ్రిగోల్డ్ కాకూడదనే మార్గదర్శి చిట్స్ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ పోతుల సునీత తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మీడియాతో మాట్లాడారు.
పోతుల సునీత ఏమన్నారంటే...
ఈనాడు రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ పేరిట వసూలు చేసిన అక్రమ డిపాజిట్లపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసి, విచారిస్తున్న నేపథ్యంలో.. విచారణ ఎదుర్కొంటున్న రామోజీరావుకు ఈ ప్రభుత్వం మీద విపరీతమైన అక్కసు కలుగుతుంది. గతంలో అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యం మాయ మాటలు చెప్పి జనాల దగ్గర్నుంచి వేల కోట్లు డిపాజిట్ల రూపంలో వసూలు చేసినట్లుగానే.. మార్గదర్శి కూడా నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా డిపాజిట్లు వసూలు చేసిందనేది ఏపీ సీఐడీకి అందిన ఫిర్యాదు. ప్రజల డబ్బుకు భద్రత, భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పా..? మార్గదర్శి మరో అగ్రిగోల్డ్ కాకూడదని గ్యారెంటీ ఉందా..? అందుకే, ఈ విషయంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. దీంతో వెర్రెక్కిన రామోజీరావు రోజుకో తీరుగా ఈ ప్రభుత్వంపై బురద జల్లే రాతలు రాస్తున్నాడు.
చంద్రబాబు, రామోజీ తోడు దొంగలు..
ఈ ప్రభుత్వం మద్యం ఆదాయం కోసం పనిచేస్తుందనే విషపు రాతలు రాస్తున్న రామోజీరావుకు.. గతంలో చంద్రబాబు చేసిన దుర్మార్గమైన మద్యం విధానాలు గుర్తుకురాలేదా..? అని సూటిగా అడుగుతున్నాను. ఎన్టీరామారావు హయాంలో అమలు చేసిన సంపూర్ణ మద్యనిషేధాన్ని ఎత్తేసిన చంద్రబాబుపై ఏనాడైనా ఇటువంటి రాతలు రాశావా రామోజీ..?. కాంగ్రెస్ హయాంలో సంపూర్ణ మద్య నిషేధం అని ఏకంగా ఉద్యమాన్నే నడిపిన రామోజీ.. చంద్రబాబు గద్దె నెక్కగానే.. ‘మద్యనిషేధం వల్ల రాష్ట్రానికి అనర్ధం’ అనే నినాదాన్ని భుజానికెత్తుకుని, ఇద్దరూ తోడు దొంగలు కలిసి, మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారించి తద్వారా వేల కోట్లు దండుకున్నది నిజం కాదా..?. చంద్రబాబు, రామోజీరావులు తోడు దొంగలని రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. రెండెకరాల చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా గడించాడో.. బాబు అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని, హైద్రాబాద్‌లో వేలాది ఎకరాల భూముల్ని కబ్జాచేసి రామోజీరావు ఎలా ఎదిగారో జనాలకు తెలియనది కాదు.
మద్యాన్ని హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేసిన బాబు.. ఎవరి రక్త మాంసాలతో వ్యాపారం చేశాడు..?
బెల్టుషాపుల ఆద్యుడే చంద్రబాబు. మద్యం దుకాణాలు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి.. అవి సరిపోవంటూ ఒక్కో దుకాణానికి అనుబంధంగా బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌లంటూ మద్యం అమ్మించిన ఘనుడు చంద్రబాబు. పాఠశాలలు, దేవాలయాలు అని చూడకుండా ఊరూరా మద్యాన్ని హెల్త్‌డ్రింక్‌గా ప్రమోట్ చేసిమరీ.. ఇంటింటికీ డోర్‌డెలివరీ చేయించి ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేసిన నీచరాజకీయ నేత చంద్రబాబు. ఈ దుర్మార్గాలపై ఈనాడులో రాయడానికి రామోజీరావుకు చేతులురావు.
బాబుకు మేలు చేయడమే రామోజీ విధానం..ః
అత్యంత ప్రజాదరణ గలిగిన ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నానాటికీ ఎదుగుతోన్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుతో పాటు ఈనాడు రామోజీరావుకు విపరీతమైన కడుపుమంట కలుగుతుంది. ఇందులో భాగంగానే ఈనాడు మా ప్రభుత్వంపై రోజుకో అడ్డగోలు కథనాల్ని అల్లుతూ ప్రజల మెదళ్ళలో విషం నింపాలని ప్రయత్నిస్తుంది. రామోజీరావుకు ఒక విధానం గానీ విలువలు గానీ ఏమీలేవు. చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేయడమే రామోజీ విధానం. అందుకే, చంద్రబాబు బాటలో నడుస్తూ ఆయనకు వత్తాసు పలుకుతూ, మా ప్రభుత్వంపై గత మూడున్నరేళ్ళుగా ఈనాడులో విషపురాతలు వండివారుస్తున్నారు.
మద్య నియంత్రణ దిశగా మా ప్రభుత్వ అడుగులుః
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే మద్యనియంత్రణకు అనేక చర్యలు చేపట్టారు. మద్యం విధానాన్నే మార్చి, ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలను ప్రభుత్వం కిందికి తెచ్చారు. చంద్రబాబు హయాంలో ఉన్న 4380 మద్యం దుకాణాలకు గాను 2934కు తగ్గించి ఆ దుకాణాలను ప్రభుత్వమే పారదర్శకంగా నడిపే విధానాన్ని అమలు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఉన్న 43వేల మద్యం బెల్టు దుకాణాలను పూర్తిగా రద్దు చేశారు. పర్మిట్‌రూమ్‌ల వ్యవస్థను కూడా రద్దు చేసి నియమిత వేళల్లోనే మద్యం అమ్మకాలుండాలనే విధానాన్ని తెచ్చారు. మద్యం ధరల పెంపుతో వినియోగాన్ని నియంత్రించే చర్యలు చేపట్టారు.
- ఒక వ్యక్తి కలిగి ఉండే బీరు, మద్యం గరిష్ట పరిమితిని ప్రభుత్వం తగ్గించింది. చంద్రబాబు హయాంలో ఏటేటా పెరిగే బార్ల సంఖ్యను జగనన్న ముఖ్యమంత్రికాగానే నిలువరించారు. అక్రమ మద్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఎస్‌ఈబీ(స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో)ను ఏర్పాటుచేశారు. ఈ చర్యలన్నీ తీసుకోవడం వలన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మద్యం వినియోగాన్ని చాలా తగ్గించింది.
మద్యం అమ్మకాలు బాబు హయాంలోనే ఎక్కువః
చంద్రబాబు హయాంలో..ః
2014-15లో ఐఎంఎల్ లిక్కర్ 288.6 లక్షల కేసులు అమ్ముడైతే.. బీరు 174.5 లక్షల కేసులు అమ్ముడయ్యాయి.
-2015-16లో ఐఎంఎల్ 306.7లక్షల కేసులు అమ్ముడైతే.. బీరు 169 లక్షల కేసులు అమ్ముడయ్యాయి.
-2016-17లో ఐఎంఎల్ 332.2 లక్షల కేసులు అమ్ముడైతే.. బీరు 174.4 లక్షల కేసులు అమ్ముడయ్యాయి.
- 2017-18లో ఐఎంఎల్ లిక్కర్ 360.85 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. అలానే బీరు 227.27 లక్షల కేసులు అమ్ముడయ్యాయి.
- 2018-19లో చూస్తే.. ఐఎంఎల్ లిక్కర్ 384.36 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. అలానే బీరు 277.16 లక్షల కేసులు అమ్ముడయ్యాయి.
- అదే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చూస్తే.. మద్య నియంత్రణ వల్ల మద్యం వినియోగం తగ్గుకుంటూ వచ్చింది.
- 2019-20లో ఐఎంఎల్ లిక్కర్ 308.53 లక్షల కేసులు అమ్ముడయ్యాయి.. అంటే మద్యం అమ్మకాలు గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే.. 20 శాతం తగ్గాయి.
- అలానే బీరు 212.91 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే.. 23 శాతం తగ్గాయి.
- 2020-21లో చూస్తే.. ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు 194.02 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే టీడీపీ హయాంతో పోలిస్తే 50 శాతం అమ్మకాలు తగ్గాయి.
- బీరు విషయానికొస్తే.. 57.57 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఏకంగా 79 శాతం అమ్మకాలు తగ్గాయి.
- 2021-22లో చూస్తే.. ఐఎంఎల్ లిక్కర్ 278.50 లక్షల కేసులు అమ్ముడయ్యాయి..అంటే టీడీపీ హయాంతో పోలిస్తే ఏకంగా 28 శాతం అమ్మకాలు తగ్గాయి.
- బీరు అమ్మకాలు చూస్తే.. 82.60 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. అంటే 70 శాతం బీరు అమ్మకాలు తగ్గిపోయాయి.
- బాబు హయాంలో ఏటికేడు మద్యం సేల్స్ పెరిగింది వాస్తవం కాదా?
- జగన్ గారి పాలనలో మద్యం ఉత్పత్తి, అమ్మకాలు తగ్గింది నిజం కాదా..?
- దీన్ని నియంత్రణ అని అంటారా.. అనరా..?
- మేం మేనిఫెస్టోలో చెప్పింది నిజం కాదా..?
మేం అధికారంలోకి వచ్చాక ఒక్క డిస్టలరీని కూడా మంజూరు చేయలేదుః
మా ప్రభుత్వ హయాంలో తీసుకున్న మద్య నియంత్రణ చర్యలు చంద్రబాబు, రామోజీల కళ్ళకుకనిపించవు. మేం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క కొత్త ఐఎంఎఫ్‌ఎల్ డిస్టలరీని మంజూరు చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న డిస్టలరీలన్నీ టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసినవే.. మా ఎన్నికల అజెండాకు కట్టుబడే మేం మద్యం వినియోగంపై దశలవారీ నియంత్రణ విధానాన్ని పాటిస్తున్నాం.
జన్మభూమి కమిటీలతోనూ మద్యాన్ని అమ్మించిన ఘనుడు బాబు..:
చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా కూడా మద్యాన్ని అమ్మించి ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేసిన వైనాన్ని ప్రజలు ఎలా మరిచిపోగలరు..? రాజకీయ స్వార్ధం, కోట్లు కూడబెట్టడమే ధ్యేయంగా రాష్ట్రాన్ని అన్నిరకాలుగా చంద్రబాబు ముంచాడు. పోలవరాన్ని ఏటీఎంగా, అమరావతిని భ్రమరావతిని చేశారు. ఇవన్నీ తెలిసి కూడా నోరుమూసుకున్న టీడీపీ మహిళానేతలు ఇప్పుడు ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం ఎంతవరకు సబబని అడుగుతున్నాను. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత మద్యంపై మాట్లాడుతూ సిగ్గూ ఎగ్గూలేకుండా నోరుపారేసుకుంటుంది. ‘అనితా.. మీ పార్టీ అధినేత చంద్రబాబును ఏనాడైనా మద్యాన్ని ఏరులై పారించావేంటి.. అని ప్రశ్నించావా..? ఇంకోసారి మా ప్రభుత్వంపైన, మా నాయకుడుపైన నోరుపారేసుకుంటే నీ నాలుకను కోసి ఉప్పుకారం పెట్టే పరిస్థితి వస్తుంది..జాగ్రత్త..’ అని హెచ్చరిస్తున్నాను.
పేదలకు పథకాలు దక్కకూడదనే విషపు రాతలుః
ఈరోజు రాష్ట్రంలో మహిళాపక్షపాతి ముఖ్యమంత్రిగా ఆసరా, చేయూత, చేదోడుతో పాటు 30 లక్షల మంది అక్కచెల్లమ్మలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఆడపడుచుల ఆరాధ్యదైవంగా మా జగన్‌మోహన్‌రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు డీబీటీ ద్వారా రూ.2 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో జమ అయితే చంద్రబాబుకు, రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడుకు కడుపు మండుతుంది. అందుకే, పేదలకు ఆ పథకాలు అందకుండా చేయాలని, ప్రభుత్వానికి ఏ విధంగానూ ఆదాయం రాకూడదని విషపురాతలు రాస్తున్నారు. 2024 ఎన్నికల్లో మేం 175 స్థానాలకు 175 గెలవబోతున్నాం. గతంలో దుర్మార్గమైన పాలనకు తగ్గట్టే టీడీపీని 23 స్థానాలకే పరిమితం చేశారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు కనీసం ప్రతిపక్ష నేత హోదాను కూడా ప్రజలు ఇవ్వరు.