మంగళగిరి: చేనేత పరిశ్రమ, కార్మికుల పరిస్థితులు, ఇబ్బందులు తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. మనం సీఎం వైఎస్ జగన్ రాష్ట్రం అంతా ప్రయాణిస్తూ వివిధ వర్గాలను కలుస్తూ వాళ్ల సమస్యలను తెలుసుకుంటూ వస్తున్నారు. ఇవాళ చేనేతల కోసం నేడు ఇక్కడ మనకు అవకాశం కల్పించడం ముఖ్యమంత్రిగారు తీసుకున్న గొప్ప నిర్ణయం. చేనేతలుగా మంగళగిరిలో మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మంగళగిరిలో తయారైన బట్ట మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశం నలుమూలల నుంచి మన మంగళగిరి వస్త్రాల కోసం వస్తున్నారు. దీనికి కారణం అప్పటి పెద్దలు స్టాండర్డ్ గా తయారు చేసిన రంగులు, నూలు, డిజైన్లు అని చెప్పుకోవాలి. మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా రోశయ్య గారిని, నన్ను పిలిచి చేనేత పరిశ్రమ పరిస్థితులు ఏంటి అని అడిగారు. 65 ఏళ్లకు పెన్షన్లు ఇస్తున్నారు, చేనేతలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇవ్వాలని కోరాను. అదెలా సాధ్యం అని ఆయన అడిగారు. రంగులు, రసాయనాల వల్ల మామూలు వ్యక్తుల కంటే చేనేత కార్మికులకు 50 ఏళ్లకే త్వరగా వృద్ధాప్యం వస్తుందని చెప్పాము. అది విని వెంటనే ఆయన అందుకు అంగీకరించారు. అలాగే చేనేతల కోసం మేము ఇచ్చిన 17 డిమాండ్లు కూడా నెరవేర్చారు. చేనేతల క్రిఫ్ట్ ఫండ్ ను రెట్టింపు చేసిన వ్యక్తి కూడా వైయస్ఆర్. అప్పట్లో 8% చేనేతలు దాచుకుంటే మరో 8% ప్రభుత్వం ఇచ్చేది. దాన్ని 16%కి పెంచారు వైయస్ఆర్. అంతకు ముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం రిబేట్‌ను తీసేసింది. దాన్ని వైయస్ఆర్ పునరుద్ధరించారు. డైస్ అండ్ కెమికల్స్ మీద సబ్సిడీని కూడా ఇచ్చారు. 100 కోట్లు ఆప్కోకి రిలీజ్ చేస్తున్నామని చెప్పి సాంక్షన్ కూడా చేసారు. దానివల్లే నేటికీ చేనేత పరిశ్రమ నిలబడింది. మంగళగిరిలో ఇళ్లులేని చేనేత కార్మికుల కోసం APIIC నుండి 25 ఎకరాల భూమిని ఇచ్చారు. ఇప్పుడు అక్కడ 3వేల కుటుంబాలు నివసిస్తున్నారు. నేడు వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో 150 మంది మగ్గాలకు షెడ్లు కూడా వేసాం. నవరత్నాల్లో అన్ని పథకాలకంటే ఎక్కువగా, చేనేతలకు ఇచ్చే పథకంలో మాత్రమే 24వేలు అందిస్తున్నారు. చేనేత కార్మికుల జీవితాలను బాగుచేసింది నాడు రాజశేఖర్ రెడ్డిగారు, నేడు జగన్ మోహన్ రెడ్డిగారు. వీరిద్దరే మనల్ని ఆదరిస్తున్నారని మనం మర్చిపోకూడదు. ఇవాళ ఆప్కోకి రూ.100 కోట్లు రిలీజ్ చేసారు. మంగళగిరిలో మార్కెటింగ్ సౌకర్యం కోసం రూ.3కోట్లతో 40 షాపుల నిర్మాణం చేయించారు. ఆ నాడు తండ్రి నేడు కుమారుడు చేనేత కార్మికులకు మేలు చేసారు. ఎన్నో ఏళ్లలో మనలను గుర్తించిన నాయకులు లేరు. ఇవాళ అసెంబ్లీలో చేనేతల నుంచి ప్రాతినిధ్యం లేదు అని ఇక్కడ ఉన్న రామకృష్ణారెడ్డిగారిని ఆపి మరీ మన చేనేత మహిళలకు టికెట్టు ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలందరి ప్రతినిధిగా లావణ్యకు ఆయన అవకాశం కల్పించారు. ఆమెను గొప్ప మెజారిటీతో గెలిపించుకుని మనబాధ్యత నెరవేర్చాలి. జగన్ గారి పరిపాలన మనకి కావాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు రాజ్యాధికారం కల్పించిన చరిత్ర మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ లేదు. ధైర్యసాహసాలతో అనేక ప్రాంతాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చి, మనలను గెలిపించే పరిస్థితికి తీసుకువచ్చింది సీఎం వైయస్ జగన్ మాత్రమే. నేటి పాలన ఎంతో ప్రత్యేకమైనది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనారటీలకు ఓసీలతో సమానంగా, ఓసీలకంటే అధికంగా మున్సిపాలిటీలు, పంచాయితీలు, కార్పొరేషన్లలలో ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేవు. ఇప్పుడు మనం ఒక మెట్టు ఎక్కుతున్నాం. మన ముఖ్యమంత్రిగారిని మళ్లీ గెలిపిస్తే మన జీవితాల్లో పేదరికాన్ని నిర్మూలించి, రాజకీయంగా మనకు మరింత ప్రాధాన్యత కల్పిస్తారు. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి.