చేనేత కార్మికులకు భరోసా ఇచ్చింది వైయస్ జగన్

నాడు-వైయస్ఆర్ ...నేడు వైయస్ జగన్ చేనేత కార్మికులకు అండగా నిలిచారు.

చేనేత రంగంలోని ప్రతి ఒక్కరూ వైయ‌స్ఆర్‌సీపీకి మధ్దతు ఇస్తారు.

ఎందరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వైయ‌స్ఆర్‌సీపీ విజ‌యాన్ని అడ్డుకోలేరు.

వైయస్ జగన్ అమలుచేసిన సంక్షేమ పధకాలే గెలుపునకు సోపానాలు.

సమాజంలో పేదరికాన్ని తొలగించేందుకు విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు.

చేనేత కార్మికుల పిల్లలు ఇంజనీర్లు,డాక్టర్లు అయ్యారంటే కారణం ఫీజురీయంబర్స్ మెంట్.

పద్మశాలి ఆత్మీయ సమావేశంలో శాసనమండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి

తాడేప‌ల్లి: చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకుని చేనేతకుటుంబాలను అభివృధ్దిలోకి తీసుకువచ్చింది నాడు- వైయస్ రాజశేఖరరెడ్డి అయితే నేడు వైయస్ జగన్ అని శాసనమండలి విప్  లేళ్ళ అప్పిరెడ్డి అని అన్నారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పద్మశాలి  ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్రంలో చేనేత అభివృధ్దికి తీసుకున్న చర్యలను ప్రతి చేనేత కుటుంబానికి చాటి చెప్పాలని కోరారు.వైయస్ జగన్ సంక్షేమ పధకాలు పొందిన ప్రతి చేనేత కార్మికుడు బ్రాండ్ అంబాసిడర్ గా మారి ప్రచారం చేయాలన్నారు.చేనేత కార్మికుల పిల్లలు నేడు ఇంజనీర్లు,డాక్టర్లుగా మిగిలిన ఉన్నత విద్యకు సంబంధించి పలు కోర్సులు చదవగలుగుతున్నారంటే అందుకు ప్రధాన కారణం నాడు వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్ మెంట్. అదే విధంగా కార్మికుల సమస్యలను అనేకం పరిష్కరించారన్నారు.చేనేత మగ్గాలను ఆదునీకరించేందుకు కూడా సహాయం అందించారన్నారు.చేనేత సహకార సంఘాలను కూడా శక్తివంతం చేశారన్నారు.ఎన్నికలప్పుడు నేతన్నలకు చెప్పిన మాట నెరవేరుస్తూ జగన్ గారు అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మొట్టమొదటిసారిగా 2019లో మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే CM జగన్ గారి పుట్టిన రోజునాడు డిసెంబరు 21 తేదీన వైయ‌స్‌ఆర్‌ నేతన్ననేస్తం తీసుకొచ్చారని వివరించారు. ఆ రోజు నుంచి వేసిన అడుగు ఈ రోజుకు వరుసగా ఐదో దఫాలతో కలిపి ఈ 50 నెలల కాలంలోనే నేతన్నలకు తోడుగా నిలబడ్డారాన్నారు.

నేతన్నలకు అండగా నిలబడుతూ.. వారికి  సామాజిక ఫించన్ల రూపంలో రూ.1396 కోట్లు వారి చేతిలో పెట్టారని, నవరత్నాలలోని ఇతర పథకాల ద్వారా మరో రూ.871 కోట్లు వారి చేతిలో పెట్టారు. ఆప్కో బకాయిలు రూ.468 కోట్లు, నేతన్న నేస్తం ద్వారా రూ.970 కోట్లు వెరసి మొత్తంగా రూ.3706 కోట్లు నేతన్నల సంక్షేమం కోసం వెచించరని తెలిపారు.

చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లకి కలిపి చేనేతలు కోసం ఇచ్చిన రూ.450 కోట్లు ఎక్కడ ? జగన్ గారి ప్రభుత్వంలో 50 నెలల కాలంలోనే రూ.3706 కోట్లు ఎక్కడా ? ఆలోచన చేయండనీ అప్పిరెడ్డి కోరారు.
చేనేతను చేయిపట్టుకుని నడిపించాలని, నేతన్నకు తోడుగా ఉండాలని ఆప్కోకు జీవం పోయడమే కాకుండా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ మీద కూడా సీఎం వైయ‌స్‌ జగన్ దృష్టి పెట్టారన్నారు. ఇంతకు ముందు లేని విధంగా అదనంగా అమెజాన్, మింత్ర, ప్లిఫ్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ల మీద నేతన్నల వస్త్రాలను అమ్మే ఏర్పాటు జరిగిందనీ వివరించారు.

ఇక రాజకీయాల విషయానికి వస్తే వైయస్ జగన్ నా ఎస్సి, నా బిసి, నా ఎస్టి, నా మైనారిటీ అంటూ 200 పార్లమెంట్,అసెంబ్లీ స్దానాలలో 50 శాతం ఈ వర్గాలకు కేటాయించారన్నారు.రాష్ర్ట వ్యాప్తంగా బడుగు,బలహీన,మైనారిటీ వర్గాలను పోటీకి పెట్టారన్నారు.అంటే సమాజంలో ఈ వర్గాలను సామాజికంగా,ఆర్దికంగా,రాజకీయంగా ఉన్నత స్దితికి తీసుకువచ్చి తద్వారా పేదరికాన్ని రూపుమాపాలనే దిశగా చేస్తున్న యజ్ఞానికి అందరూ చేయూత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ప్రతి చేనేత కార్మికుడు రాష్ర్టంలోని వివిధ నియోజకవర్గాలలో ఉన్నప్రతి చేనేత కుటుంబానికి వైయస్ జగన్ చేస్తున్న మేలును వివరించాలన్నారు.రానున్న ఎన్నికలలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్దులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సమావేశంలో శాసనమండలి సభ్యుడు మురుగుడు హనుమంతరావు,మంగళగిరి పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్య, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, పద్మశాలి కార్పోరేషన్ చైర్ పర్సన్ జింకా విజయలక్ష్మి, పార్టీ నేతలు నారాయణమూర్తి, చిల్లపల్లి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు
 

Back to Top