గుంటూరు :వైయస్ఆర్‌సీపీ మేనిఫెస్టో కాసేపట్లో విడుదల కానుంది. శనివారం తాడేపల్లిలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం దాకా అమలు చేసింది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం. దీంతో అటు ప్రజల్లో, ఇటు రాజకీయ శ్రేణుల్లో ఈ ఎన్నికల మేనిఫెస్టోపై ఆసక్తి నెలకొంది. అయితే అలవికాని హామీలు, ఆచరణ సాధ్యం కానివి మేనిఫెస్టోలో ఉండవని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఇక సిద్ధం బహిరంగ సభలు.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయిన సీఎం వైయస్ జగన్.. రేపటి నుంచి మరో జైత్రయాత్రకు సిద్ధం అవుతున్నారు. వైయస్ఆర్‌సీపీ మూడో విడత ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనబోతున్నారు. అనంతపురం తాడిపత్రిలో రేపు తొలి ఎన్నికల ప్రచార సభ జరగనుంది. మే 11వ తేదీ దాకా రోజూ మూడు సభలు నిర్వహించేలా వైయస్ఆర్‌సీపీ ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది.