బీసీలపై టీడీపీ నేతలకు ఎందుకంత అక్కసు  

బీసీల అభివృద్ధి కోసం చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించలేదు

బాబు నిజ స్వరూరం చూసే ఆ పార్టీకి బీసీలు దూరమయ్యారు

బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకు కోసమే వాడుకున్నారు

వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక బీసీల సంక్షేమంపై దృష్టి పెట్టారు.

వైయస్‌ జగన్‌ మంత్రివర్గంలోనూ, ఇతర పదవుల్లోనూ బీసీ వర్గాలకు న్యాయం చేశారు

బిర్రు ప్రతాప్‌రెడ్డి చేత కోర్టులో వేసిన పిల్‌ను ఉపసంహరించుకోవాలి

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

తాడేపల్లి: బీసీలను రాజకీయంగా  ఎదగకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని,  బీసీలపై ఎందుకంత అక్కస్సు వెళ్లగక్కుతున్నారని వైయస్ఆర్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై టీడీపీకి చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు చేయడంతో  ఎన్నికలు ఆగిపోయాయని, ఆయనతో పిటిషన్‌ విత్‌ డ్రా చేయించి బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. 
2013లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేశారు. మళ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. బిర్రు ప్రతాప్‌రెడ్డి ఈ రిజర్వేషన్లను అడ్డుకునే ఆలోచనతో ఒక పిల్‌ వేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి డిసెంబర్‌ 20న ఉత్తర్హులు జారీ చేసింది. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్హులు జారీ చేసింది. టీడీపీ నాయకుల ఆలోచన ఏంటో అర్థం కావడం లేదు. బీసీ వర్గాలంతా కూడా వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాకముందు టీడీపీకి పట్టం కట్టారు. అయితే చంద్రబాబు బీసీ వర్గాల గురించి ఏనాడు ఆలోచన చేయలేదు. ఈ రోజు వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత 50 శాతం నామినేటేడ్‌ పదవులు, పనులపై చట్టం చేశారు. బిర్రు ప్రతాప్‌రెడ్డి టీడీపీకి సంబంధించిన వ్యక్తి.  ఎమ్మెల్సీగా ఉన్న రాజేంద్రప్రసాద్‌ సర్పంచ్‌ల సంఘాలనికి అధ్యక్షుడు. కర్నూలుకు చెందిన ప్రతాప్‌రెడ్డి టీడీపీ తరఫున జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఈయన సుప్రీం కోర్టులో పిల్‌ వేస్తే..ఎన్నికలపై స్టే విధించింది. రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. బీసీ  వర్గాలంతా కూడా ఇప్పుడు వైయస్‌ జగన్‌ వైపు ఉన్నారని టీడీపీ నేతలు అక్కస్సు వెళ్లగక్కుతున్నారు. టీడీపీ నేతలకు ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే..బీసీ వర్గాలపై ప్రేమ ఉంటే..కృతజ్ఞత భాగం ఉంటే ఆ పిల్‌కు సంబంధించిన పిటిషన్‌ విత్‌డ్రా చేయించగలరా? బీసీ వర్గాలకు అవకాశం వచ్చింది. ఇన్నాళ్లు చంద్రబాబు బీసీ వర్గాలకు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. మీ నిజస్వరూపం తెలుసుకొని వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. వైయస్‌ జగన్‌ మంత్రి మండలి కూర్పులో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చోటు కల్పించారు. ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లలోఅధికశాతం ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయంగా వెనుకబడిన బీసీలను ఆదుకోవాలని 50 శాతం నామినేటేడ్‌ పదవులు కూడా ఇచ్చేందుకు వైయస్‌ జగన్‌ చట్టం చేశారు. బాపట్ల వంటి మార్కెట్‌ యార్డుకు ఇప్పటి వరకు కూడా బీసీ వర్గాలకు చోటు లేదు. మా నాయకుడు వైయస్‌ జగన్‌ మొట్ట మొదట కృష్ణమూర్తిని మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా నియమించారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మీకు కళ్లు కుట్టాయా? బీసీ వర్గాలను చంద్రబాబు వాడుకుని వదిలేశారు. రేపు రిజర్వేషన్లపై కోర్టులో తీర్పు రాబోతుంది. ఇప్పటికైనా మీరు పిటిషన్‌ విత్‌ డ్రా చేసుకొని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. బీసీలపై వైయస్ఆర్ సీపీకి ఒక విజన్‌ ఉంది. మా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో బీసీల రిజర్వేషన్లపై చట్టబద్ధం కావాలని పోరాటం చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో బీసీ సబ్‌ప్లాన్‌కు ఎంత ఖర్చు చేశారు. ఇవాళ వైయస్‌ జగన్‌ మొట్ట మొదటి బడ్జెట్లోనే రూ.15 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌కు కేటాయించారు. 

Back to Top