హామీల‌న్ని అమ‌లు చేస్తున్నాం

పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ఉద‌య‌భాను
 

ఎన్టీఆర్ జిల్లా:  ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌న్ని అమ‌లు చేస్తున్నామ‌ని ఎమ్మెల్యే ఉద‌య‌భాను అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండ‌ల ప‌రిష‌త్‌ కార్యాలయంలో పెన్షన్ వారోత్సవాల్లో భాగంగా నూతనంగా మంజూరైన 279 పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెన్షన్ల పండుగ వాతావరణం ఏర్పడిందని, ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అవ్వ తాతలకు, అక్క చెల్లెమ్మలకు,అన్నదమ్ములకు అండగా ఉంటూ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ రూ. 3000 వరకు పెంచుకుంటూ పోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ రోజు రూ. 2750 పెంచి పింఛ‌న్ సొమ్ము అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు. గత ప్రభుత్వంలో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు  అవస్థలు పడుతూ గంటల తరబడి క్యూలో  నిల‌బ‌డేవార‌న్నారు. ఇవాళ అలాంటి ప‌రిస్థితులు లేవ‌న్నారు. తెల్ల‌వార‌క‌ముందే వాలంటీర్ ద్వారా గుమ్మం వ‌ద్ద‌కే పింఛ‌న్ సొమ్ము తెచ్చి ఇస్తున్నామ‌ని తెలిపారు.    కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మ‌న్‌ తన్నీరు నాగేశ్వరరావు, డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్, సర్పంచ్ భూక్య సీతమ్మ, ఎంపీపీ చెంబెటి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ  దేవమని, వైస్ ఎంపీపీలు కాటేపల్లి రామలక్ష్మ, కొలికపోగు వెంకటేశ్వర్లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top